Brahmamudi మళ్లీ ఒక్కటైన అప్పు,కల్యాణ్.. అత్తింట్లో రాజ్​కు తిప్పలు.. ఫన్నీమోడ్​లో సాగుతున్న సీరియల్

బ్రహ్మముడి సీరియల్ ఈ వారం మొత్తం ఆసక్తిగా సాగింది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు అనేక ట్విస్టులతో సీరియల్ ప్రేక్షకులను అలరించింది. ఇక కావ్య, ఆమె బావ భాస్కర్ కలిసి నాటకం స్టార్ట్ చేశారనే సంగతి తెలిసిందే. అయితే వీరి డ్రామా డోస్ మరింత పెంచారు. ఇక వీరికి ఇందిరాదేవి సపోర్ట్ ఉండటంతో మరింత రక్తి కట్టిస్తున్నారు.

మరోవైపు రాజ్ టెన్షన్, కంగారు ప్రేక్షకుల్లో కామెడీని పూయిస్తుంది. కల్యాణ్ ఆఫీసులో వర్క్ చేయడం లేదని అనామిక తెలుసుకుని రచ్చ చేస్తుంది. ఇక కల్యాణ్ తానేంటో నిరూపించుకుంటా అంటూ కవితలు పబ్లిష్ చేయించుకునేందుకు బయటకు వస్తాడు. ఇక అప్పును కలిసి బాధలు చెప్పుకుంటారు. ఇలా వారం మొత్తం ఆసక్తిగా, ఉత్కంఠభరితంగా సాగింది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు బ్రహ్మముడి సీరియల్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 February 26th to March 2nd episode

ఫిబ్రవరి 26వ తేదీ సీరియల్​లో కావ్య తన బావతో కలిసి బయటకు వెళ్తుంది. దీంతో రాజ్ శ్వేత కూడా ఫాలో అవుతారు. ఇక అక్కడికి ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. దీంతో రాజ్ కంగారు పడి.. కావ్య దగ్గరకు వెళ్తాడు. దీంతో అక్కడికి వచ్చిన సీతారామయ్యా ఏమైంది కావ్యకు ప్రపోజ్ చేయడానికి వచ్చావా అని రాజ్ ను అడుగుతాడు. దీంతో అవును అని చెప్తాడు రాజ్. కావ్యకు బోకే ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు రాజ్. ఆ తర్వాత కావ్య కూడా రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. పూర్తి ఎపిసోడ్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 February 26th to March 2nd episode

ఫిబ్రవరి 27వ తేదీ సీరియల్​లో రాజ్, కావ్య ప్రపోజ్ వీడియో చూసి సుభాష్, ప్రకాష్ కూడా తమ భార్యలకు ప్రపోజ్ చేయాలనకుంటారు. ఇద్దరు వెళ్లి వారి భార్యలకు ప్రపోజ్ చేస్తారు. మరోవైపు స్వప్న కూడా రాహుల్ కు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఇస్తుంది. రుద్రాణి మాత్రం అనామికను రెచ్చగొట్టి ఆఫీసుకు పంపిస్తుంది. ఆఫీసులో కల్యాణ్ ఏం చేస్తున్నాడో చూసి రమ్మని చెప్తుంది. ఆఫీసుకు వెళ్లి అనామిక.. కల్యాణ్ ను చూసి షాక్ అవుతుంది. పూర్తి ఎపిసోడ్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 28వ తేదీ సీరియల్​లో కల్యాణ్ ఆఫీసుకు పోయి.. కవితలు రాస్తున్నట్లు తెలుసుకున్న అనామిక.. ఇంట్లో పంచాయితీ పెడుతుంది. ఆఫీసుకు పోయి నువ్వు ఇదా చేసేది అంటూ నానా మాటలు అంటుంది. కావ్యను కూడా తిడుతుంది. అంతే కాదు.. కల్యాణ్ రాసుకున్న కవితలను పైనుంచి కిందపడేస్తుంది. దీంతో విసిగిపోయిన కల్యాణ్ నేను ఇలాగే ఉంటాను.. ఇష్టం ఉంటే ఉండు లేదంటే వెళ్లిపో అని చెప్తాడు. ఇందిరాదేవి కూడా సీరియస్ అవుతుంది. పూర్తి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 February 26th to March 2nd episode

ఫిబ్రవరి 29వ తేదీ సీరియల్​లో అనామిక గార్డెన్ లో ఉంటే.. కల్యాణ్ రాసిన కవితను తీసుకువచ్చి కావ్య ఆమెకు ఇస్తుంది. దీంతో కావ్య మీద కూడా అనామిక సీరియస్ అవుతుంది. దూరం నుంచి గమనించిన స్వప్న.. అనామిక దగ్గరకు వచ్చి గట్టి వార్నింగ్ ఇస్తుంది. మెంటల్ అంటూ తిడుతుంది. మరోవైపు సారీ అంటూ అనామికకు కల్యాణ్ చెప్తాడు. నా పక్కన పడుకునేందుకు సారీ చెప్తున్నావా అంటూ అనామిక అంటుంది. దీంతో కల్యాణ్ సీరియస్ అవుతాడు. పూర్తి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్చి 1వ తేదీ సీరియల్​లో కల్యాణ్ కు కొత్త ఆఫీస్ బ్రాంచ్ పేపర్స్ ఇస్తే.. తీసుకోడు. తాను కవితలు మాత్రమే రాస్తాను అని డిసైడ్ అవుతాడు. ఇక తన కవితలను పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. ఎవరు పబ్లిష్ చేయడానికి ముందుకు రారు. దీంతో అలసిపోయి కొబ్బరి బొండం నీళ్లు తాగుతాడు. డబ్బులు ఇద్దామంటే లిక్వేడ్ క్యాష్ ఉండవు. అప్పుడు అప్పు వచ్చి సాయం చేస్తుంది. దీంతో కల్యాణ్, అప్పు మళ్లీ కలుసుకుంటారు. పూర్తి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 February 26th to March 2nd episode

మార్చి 2వ తేదీ సీరియల్​లో కావ్య తన బావతో డ్రామా డోస్ పెంచుతుంది. పుట్టింటికి వెళ్తానని చెప్పి.. బావతో కలిసి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. రాజ్ కూడా వారితో బయలుదేరుతాడు. ముగ్గురు కలిసి కనకం ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ రాజ్ కు అవమానం జరుగుతుంది. అయినా కానీ పట్టించుకోడు. మరోవైపు కావ్య, ఆమె బావ కలిసి నాటకం మరింత రక్తి కట్టించేందుకు కొత్త ప్లాన్ వేస్తారు. పూర్తి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X