Brahmamudi Weekly Roundup:రాజ్ మనసు గెలుచుకుంటున్న కావ్య..జైలు నుంచి అప్పు రిలీజ్..ఇంకా ఈ వారం ఏం జరిగిందంటే?
బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జూలై 3 నుంచి జూలై 8 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
జూలై 3 ఎపిసోడ్లో: రాజ్, కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి మన మధ్య ఏమైనా జరిగిందా అని రాజ్ అడుగుతాడు. నేను చెప్పలేను బాబు, నాకు సిగ్గేస్తుంది అని నవ్వుతూ కావ్య వెళ్లిపోతుంది. అంటే నా జీవితంలో నేనే నిప్పులు పోసుకున్నానా అనుకుంటారు రాజ్. కావ్య మెట్లు దిగి కిందకు వస్తుంది.

అక్కడే అందరూ కూర్చొని ఉంటారు. కావ్య.. వచ్చి ఏంటి ఈ లగేజీ అంతా అని అడుగుతుంది. రాజ్ కూడా.. ఏంటి తాతయ్య, ఇంత పొద్దున్నే ఎక్కడికో రెడీ అయినట్టుగా ఉన్నారని అడుగుతాడు. అవును రాజ్.. శ్రీశైలం వెళ్దామని మీ నాన్నమ్మ పట్టుబట్టిందని దుగ్గిరాల సీతారామయ్య వివరిస్తాడు. నీకు పెళ్లాయ్యాక వెళ్దామని మెుక్కుకున్నామని చెబుతుంది నాన్నమ్మ.
జూలై 4న ఎపిసోడ్లో: అప్పు తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. అయితే అందులో రాకేష్ అనే వ్యక్తి.. అప్పు వల్ల అక్కలను కించపరుస్తూ మాట్లాడుతాడు. ఇక అప్పు కోపంతో ఊగిపోతుంది. అంతే గ్రౌండులోనే రాకేశ్ తలపగులగొట్టేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది. ఏమైంది డల్ గా ఉన్నావంటూ కనకం అడగ్గా... వెళ్లి బట్టలు పిండు నన్ను పిండకు అని సీరియస్ అవుతుంది. ఏమైంది దీనికి అని కనకం అనుకుంటుంది. అప్పు రాకేశ్ గురించి ఆలోచిస్తూ... ఏమైందో ఏంటోనని కంగారుపడిపోతుంది. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

జూలై 5న ఎపిసోడ్లో: మరోవైపు తన ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రాజ్ చాలా సంతోషంగా ఉంటాడు. సంతోషానికి కారణం ఏమిటని కావ్య అడగ్గానే రాజ్ చిరగ్గా ఫేస్ పెడతాడు. కావ్యపై సెటైర్స్ వేయాలని అనుకున్న రాజ్ ప్లాన్ రివర్స్ అవుతుంది. ఆ తర్వాత రాత్రి ఏం జరిగిందో చెప్పమని కావ్యను అడుగుతాడు రాజ్. తాను మర్చిపోయానని బదులిస్తుంది కావ్య. రాజ్ గుర్తుచేసినా కూడా కావ్య మాత్రం ఆ విషయం ససేమిరా చెప్పనని అంటుంది.
మాట మీద నిలబడటం నీకు అలవాటు లేదా..అదే నేను అయితే మాట కోసం ప్రాణం ఇస్తానని కావ్యపై మరోసారి సెటైర్స్ వేస్తాడు రాజ్.స్వప్న విషయంలో నిజం బయటపడి తన తప్పు లేదని తెలితే తన భార్యగా స్వీకరిస్తారనని మాటిచ్చినా అది నిలబెట్టుకోలేకపోయారని రాజ్‌ను నిలదీస్తుంది కావ్య. రాజ్ తన తప్పును ఒప్పుకుంటాడు.పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

జూలై 6న ఎపిసోడ్లో: కావ్య మీద కోపంతో అన్నం తినకుండా ఉంటాడు. ఐస్ క్రీమ్ తింటుంటే శుభ్రంగా నేను చేసిన వంట తింటే ఈ చెత్త తినే పని ఉండేది కాదు కదా అంటుంది కావ్య. ఆ తర్వాత శృతి వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయని తెగ మెచ్చుకుంటాడు రాజ్. అవి కావ్య డిజైన్స్ కనుక మనసులోనే పొంగిపోతుంది. నా ప్రేమని గుర్తించలేదు కనీసం నాలోని టాలెంట్ ని గుర్తించారని మురిసిపోతుంది. కట్ చేస్తే... కృష్ణమూర్తి వాళ్ళు పోలీస్ స్టేషన్ బయటే ఉంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళని అప్పు చూసి ఒకసారి నాన్నని పిలవమని కానిస్టేబుల్ ని అడుగుతుంది.పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
జూలై 7న ఎపిసోడ్లో: కావ్య కళ్యాణ్ కి ఫోన్ చేసి మీ అన్నయ్యకి బాగోలేదు ఆస్తమా ఎక్కువైందని చెప్పి ఏడుస్తుంది. వెంటనే ఫోన్ రిసెప్షన్ వాళ్ళతో మాట్లాడి బిల్ పే చేస్తాడు. ఇంకేం కంగారు పడొద్దని ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కంపెనీ కారు కూడా వస్తుందని ధైర్యం చెప్తాడు. వదిన చాలా కంగారు పడుతుంది అప్పుకి ఫోన్ చేసి చెప్తే తను తోడుగా ఉంటుందని అనుకుని కాల్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. డబ్బులు కట్టిన తర్వాత డాక్టర్ రాజ్ కి ట్రీట్మెంట్ ఇస్తారు. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
జూలై 8న ఎపిసోడ్లో: కోడలిపై అపర్ణ ఫైర్.. వెనకేసుకొచ్చి రాజ్.. తన కొడుకుకు ప్రాణాపాయ పరిస్థితి రావడానికి కారణం నువ్వేనంటూ తన కోడలు కావ్యపై అపర్ణ విరుచుకుపడింది. కానీ రాజ్ ఎంట్రీ ఇచ్చి.. ఆమె తప్పేమీ లేదని చెప్పి అపర్ణకు నచ్చజెప్పుతాడు. వద్దన్నా వినకుండా తానే ఐస్ క్రీమ్ తినినందుకే ఇలా జరిగిందని గొడవను ఆపుతాడు. సమయానికి కావ్యనే ఎంతో కష్టపడి స్కూటీ మీద హాస్పిటల్కు కూడా తీసుకెళ్లినట్లు వివరిస్తాడు.పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











