Brahmamudi Weekly Roundup: ఈ వారం మొత్తం ట్విస్టులే..రాజ్‌కు దగ్గరవుతున్న కావ్య.. జైలుకు అప్పు..ఏం జరగనుందో?
బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జూన్ 26 నుంచి జూలై 1 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
స్వప్నమాటలకు ఇంట్లో వాళ్లు మద్ధతు:ఇక స్వప్న మాటలు విన్న ఇంట్లో వాళ్ళు ఆమెకు మద్దతుగా మాట్లాడుతారు. రుద్రాణి రాహుల్ పై అందరూ ఫైర్ అవుతారు. రాహుల్ త్వరగా రావాలని రుద్రాణి మీద సుభాష్ సీరియస్ అవుతాడు. ఇది ఆడవాళ్ళ ముందు చెప్పుకునే సమస్య అందరి ముందు స్వప్న బయట పెట్టిందంటే రాహుల్ ఘనకార్యం ఏంటో అర్థం అవుతుందని అపర్ణ అంటుంది. ఇంట్లో మనిషికో మాట అంటారు. రాహుల్ స్వప్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని రుద్రాణిని నిలదీస్తారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

స్వప్న బొప్పాయి పండు తింటు ఉండగా... అపర్ణ కోపంగా ఏం తింటున్నావ్ బొప్పాయి తింటున్నావా అని అడుగుతుంది. అవును ఏమవుతుంది అని స్పన్న అంటుంది. పూర్తిగా తినేశాక చూసి ఉంటే బాగుండేది కడుపు పోయేది వదిలించుకునే వాళ్ళమని రుద్రాణి మనసులో అనుకుంటుంది. బొప్పాయి తింటే కడుపు పోతుందని కావ్య తన చేతిలోని బౌల్ లాగేసుకుంటుంది. లేని కడుపు గురించి ఇంత గోల చేస్తారు ఏంటని స్వప్న అనుకుంటుంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
స్వప్న బెదిరింపు: రాహుల్ నన్ను ప్రేమించానని చెప్పి వాడుకుని వదిలేశాడు డాక్టర్. చావు అయినా బతుకు అయినా అతనే అనుకున్నాను... నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేసుకున్నాను. నన్ను మోసం చేయాలని అనుకున్నాడు. అందుకే ఇలా చేశానని చెప్తుంది. నువ్వు మీ అత్తకి ద్రోహం చేస్తున్నావ్ కానీ నేను వృత్తికి ద్రోహం చేయలేనని డాక్టర్ వెళ్లబోతుంటే స్వప్న గొంతు మీద కత్తి పెట్టుకుంటుంది. మీరు వెళ్ళి నిజం చెప్తే నేను ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తుంది. మరోవైపు నిజం బయట పడిపోయి ఉంటుంది, నా భర్త నన్ను అసలు క్షమించడని కావ్య టెన్షన్ పడుతుంది.
రాహుల్ ను రుద్రాణి రెడీ చేస్తుంది. ఇప్పుడు నువ్ దుగ్గిరాల కంపెనీలకు ఎండీలా ఉన్నావ్ అని రుద్రాణి అంటుంది. ఎండీ నువ్వే అయ్యేలా పరిస్థితులను తిప్పుకో అని చెబుతుంది. అదేలా సాధ్యం మామ్ అని అడుగుతాడు. రాజ్, కావ్యలను సమస్యలతో అల్లాడేటట్టు నేను చేస్తా... నువ్వు వెళ్లి రాజ్ ను ఆఫీస్ డామినేట్ చేయ్ అంటుంది. ఓకే అని చెప్పి ఆఫీసుకు వెళ్తాడు.
ఇక ఆఫీసుకు వెళ్లి ఎండీ సీటులో కూర్చొంటాడు. అటెండర్ వచ్చి.. ఇది మీ ప్లేస్ కాదని చెబుతాడు. వచ్చి వేరే క్యాబిన్ చూపిస్తాడు. ఇదే సమయంలో రాజ్ అటు వైపు వెళ్తుంటే చూస్తాడు. నన్ను నీ అసిస్టెంట్ గా పెట్టుకున్నావ్ కదా రాజ్.. నీ నిర్ణయం ఎంత తప్పొ నీకే చూపిస్తాను అనుకుంటాడు.ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
రాజ్ రుద్రాణి మాటల గురించి ఆలోచిస్తుంటే అపర్ణ వస్తుంది. నేను కళ్యాణ్ ని ఎలా చూస్తానో రాహుల్ ని అలాగే చూస్తాను కదా మామ్ అంటాడు. కానీ రాహుల్ తప్పులు చేసి దొరికిపోయాడు. వాడు తప్పు చేశాడని వదిలేయలేదు పెడదారిన పడ్డాడని మందలించాను. అందులో తప్పేముందని రాజ్ బాధపడతాడు. నువ్వు నీలాగే ఉండమని అపర్ణ సర్ది చెప్తుంది.
రేపు నీ స్థానం కోరుకోడని నమ్మకం ఏంటని అడుగుతుంది. ఇంత జరిగినా కూడా అతన్ని ఎలా దగ్గరకి రానిస్తున్నావని అంటుంది. మేము ముగ్గురం కలిసి పెరిగాము. ఒక మనిషిని అభిమానించినప్పుడు తన తప్పులు కూడా క్షమించాలని చెప్తాడు. అది విని ఒక మనిషి ఇంతగా అభిమానిస్తారా? తప్పులు చేసినా కూడా ఒప్పుకుంటారా? ఎంత మంచి వాళ్లని కావ్య మురిసిపోతుంది.ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
జైలులో అప్పు.. ఆ తర్వాత భాగం ప్రోమోలో అప్పు ఎవరితోనే గొడవ పడటం జరుగుతుంది. 'మీ చిన్న అక్కేమో దొంగలా.. పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకుంది. పెద్ద అక్కేమో కడుపు చేసుకుని పెళ్లి చేసుకుంది' అని ఒకడు వాగగా.. అప్పు కోపంతో బ్యాట్ పట్టుకొని అతడి తలపై కొడుతుంది. దీంతో పోలీసులు అప్పును ఇంటికి వచ్చి మరీ అరెస్ట్ చేసి జైలులో వేస్తారు. ఈ విషయం తెలుసుకుని కావ్య షాక్ అవుతుంది. మళ్లీ సోమవారం కొత్త ఎపిసోడ్‌తో కలుద్దాం బైబై..ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











