Brahmamudi డీఎన్ఏ టెస్టుకు సిద్ధమన్న స్వప్న... అక్క కోసం రంగంలోకి కావ్య.. ఈ వారం ట్విస్టులే ట్విస్టులు!

బ్రహ్మముడి సీరియల్ ఈ వారం పూర్తి ట్విస్టులతో సాగింది. స్వప్నను ఇరికించేందుకు రాహుల్ స్కెచ్ వేస్తాడు. స్వప్న బాయ్ ఫ్రెండ్ అరుణ్ ను రంగంలోకి దించి.. ఇంట్లో వాళ్లకు స్వప్న మీద డౌట్ వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత అడ్డంగా ఇంట్లో వాళ్ల ముందే స్వప్నను బుక్ చేస్తాడు. ఇక స్వప్న ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడుతుంది. దీంతో రాహుల్.. ఆ బిడ్డకు నేను తండ్రిని కాదంటూ చెప్తాడు. ఇక అప్పటి వరకు మౌనంగా ఉన్న స్వప్న ఒక్కసారిగా శివంగిలా మారిపోయి.. రాహుల్ చెంపపగుల గొడుతుంది. డీఎన్ఏ టెస్టుకు సిద్ధం అంటూ సవాల్ విసురుతుంది. మరోవైపు అప్పు ప్రేమ విషయం మూర్తికి తెలిసిపోతుంది. ఇలా వారం మొత్తం ఉత్కంఠగా సాగింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 18వరకు ఏం జరిగిందో ఈస్టోరీలో తెలుసుకుందాం.

స్వప్నను ఇరికించేందుకు రాహుల్ స్కెచ్ వేస్తాడు. స్వప్న బాయ్ ఫ్రెండ్ అరుణ్ ను రంగంలోకి దించుతాడు. అరుణ్.. దుగ్గిరాల ఇంటికి స్వప్నతో కలిసి దిగిన ఫోటోలు పంపుతాడు. అవి చూసిన ఇందిరాదేవి... స్వప్నను అడుగుతుంది. అవి చూసిన స్వప్న... ఎవరో తెలయదు అంటూ అబద్ధం చెప్తుంది. ఇక ఇందిరాదేవికి అనుమానం కలుగుతుంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 November 20th to November 25th episode

స్వప్నను అరుణ్ బెదిరించడం స్టార్ట్ చేస్తాడు. పదిలక్షలు కావాలి అని అడుగుతాడు. నీకు నాకు ఏం సంబంధం... వచ్చి ఇంట్లో మాట్లాడుకో నాకేం భయం లేదని స్వప్న అంటుంది. దానికి నేను ఎందుకు వస్తాను.. కోరియర్లో ఫోటోలు వచ్చినట్లు... మనం హోటల్లో గడిపినట్లు మార్ఫింగ్ ఫోటోలు వస్తాయని బెదిరిస్తాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

అప్పు సూసైడ్ చేసుకున్నట్లు కనకం కల కంటుంది. ఒక్కసారిగా అప్పు అంటూ లేస్తుంది. మూర్తి షాక్ అవుతాడు. ఇక పీడకల అని చెప్పి.. వాటర్ తాగొస్తా అని చెప్తుంది. అప్పు గదికి వెళ్లి చూస్తే.. అప్పు కనబడదు. బయటకు వెళ్లి చూస్తే... బావి మీద కూర్చొని ఉంటుంది. కనకం చూసి షాక్ అవుతుంది. మరోవైపు రాజ్ గదిలోకి దొంగ దూరుతాడు. రాజ్, కావ్యలను కట్టేసి.. దోచుకోవాలని చూస్తాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

స్వప్న బయటకు వెళ్లి ఇంటికి వస్తుంది. ఇక అందరూ హల్లో ఉండటం చూసి.. రాహుల్ తన డ్రామాను మొదలు పెడుతాడు. ఆగు అంటూ స్వప్నపై అరుస్తాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎక్కడకు వెళ్లావు అని స్వప్నను రాహుల్ అడుగుతాడు. ఇక రుద్రాణి ఎంటర్ అయి... అదేంట్రా అలా అడుగుతావు, తను పార్లర్ కి వెళ్తున్నాను అని నాకు చెప్పే వెళ్ళిందని చెప్తుంది.పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 November 20th to November 25th episode

స్వప్న ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్లకు తెలుస్తోంది. ఆ బిడ్డకు నేను తండ్రి కాదంటూ రాహుల్ ప్లేట్ ఫిరాయిస్తాడు. దీంతో స్వప్న.. రాహుల్ చెంప పగులగొడుతుంది. ఈ బిడ్డ మీ బిడ్డ అని నిరూపించుకోవడానికి నేను ఎంత దూరం అయినా వెళ్తానని చెప్తుంది. నేను అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను.... నేను రెడీ... రాహుల్ నువ్వు రెడీయా అంటూ సవాల్ విసురుతుంది స్వప్న. ఒక ఆడపిల్ల అంత గట్టిగా, అంతా కాన్ఫిడెంట్ గా తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది అంటే అందులో కూడా నిజం ఉండి ఉండవచ్చు నిజా నిజాలు తెలియకుండా నిందలు వేయవద్దని సీతారామయ్య అంటాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X