Brahmamudi: ఆస్తి కోసం రుద్రాణి స్కెచ్.. కావ్య కొత్త లవ్ డ్రామా.. సీతారామయ్య వీలునామాలో ఏం రాశాడు?
బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారం అవుతుంది. అయితే ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇక గత వారం మొత్తం కూడా అంటే నవంబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం.
నవంబర్ 6వ తేదీ బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న చేసిన పనికి కనకం... కూతురి చెంపలు పగులగొడుతుంది. అంత తప్పు ఏం చేశాను అంటూ స్వప్నఅడుగుతుంది. కావ్య మీద ఎందుకు నిందలు వేశావ్ అని అడుగుతుంది. కొట్టడం కాదు.. చంపేయాలి అంటూ పొట్టుపొట్టు కొడుతుంది. నీ చిన్న కూతురు నువ్వు అనుకున్నంత గొప్పది కాదు.. అని అంటుంది స్వప్న. తప్పు చేసిందే కాకుండా నోరు లేస్తుందేంటి అంటూ కనకం.. చీపూరు పట్టుకువచ్చి మరీ కొడుతుంది. ఇక స్వప్న అరుస్తుంది. నువ్వు నీతిమంతురాలు అన్నట్లు నన్ను కొడుతున్నావ్ ఏంటి.. అంతగా వస్తే.. నిన్ను నువ్వు కొట్టుకో.. అంటుంది స్వప్న. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నవంబర్ 7వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో... కావ్య, స్వప్నలను ఇంట్లో ఉంచాలా వద్దా అనేది నిర్ణయించడానికి ఇంట్లో సమావేశం పెడుతారు. ఇక దుగ్గిరాల సీతారామయ్య తీర్పు వెలువరించనున్నారు. ఇందీరాదేవి నువ్వు చెప్పు బావ అంటూ సీతారామయ్యను అడుగుతుంది. ఇక సీతారామాయ్య మాట్లాడుతు ఉండగా.. రాహుల్ అడ్డుతలుగుతాడు. ఏమైంది అడుగుతాడు సీతారామయ్య. నేను తప్పు చేశాను.. ఒక్క తప్పు కాదు.. చాలా తప్పులు చేశాను.. ఇంత పెద్ద కుటుంబంలో మచ్చతెస్తాను అనే బాధతోనే చెప్పలేదు. మీరు ఒప్పుకున్న తర్వాతే నేను స్వప్నను పెళ్లి చేసుకున్నాను. స్వప్నను ప్రేమగా చూసుకున్నాను.. అంటూ రాహుల్ రివర్స్ డ్రామా ప్లే చేశాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నవంబర్ 9వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో తప్పని సరి పరిస్థితుల్లో నేను మౌనంగా ఉన్నాను అంటుంది కావ్య. నీ మౌనం ఖరీదు.. ఈ ఇంట్లో వాళ్ల అందరి సంతోషం.. దాన్ని దూరం చేశావ్ నువ్వు అంటాడు రాజ్. తాతాయ్య ఆరోగ్యం ఇలా ఉందని నాకు తెలియదు అండి అంటుంది కావ్య. తెలిసి ఉంటే.. మీ అక్కతో కలిసి ఇంకా ప్లాన్ చేసేదానివి కదా అంటాడు రాజ్. ఇక కావ్య ఎంత చెప్పినా... రాజ్ వినిపించుకోడు.. మా అమ్మను కూడా ఎదిరించాను అని చెప్తాడు రాజ్. ఏ భార్య అయినా నలుగురిలో తన భర్త పరువు కాపాడాలని అనుకుంటుంది. ఇలా జోకర్ లా చేయాలనుకోదు.. ఆ విషయంలో 100 పర్సంట్ సక్సెస్ అయ్యావ్... అంటాడు రాజ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నవంబర్ 10వ తేదీ రుద్రాణి.. సీతారామయ్యను కాక పడుతూ ఉంటుంది. మీరు కనకపోయినా.. నన్ను కన్నకూతురిలా పెంచారు అంటూ సీతారాయ్యతో రుద్రాణి అంటుంది. ఈ ఇంట్లో వాళ్లు నన్ను, నా కొడుకుని ఇంటి పనిమనిషుల్లా చూస్తున్నారు. నువ్వు ఉన్నప్పుడే నాకు, నా కొడుక్కు ఏదో ఒక దారి చూపించు నాన్న అంటూ ఏడుస్తుంది. ఇక ఖాళీ దస్తావేజులు సీతారామయ్య చేతిలో పెట్టి... డ్రామా ప్లే చేస్తుంది. ఇక ఈ విషయాన్ని అంతా ధాన్య లక్ష్మి చూస్తూ ఉంటుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నవంబర్ 11వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య.. రాజ్ ను అన్నం తినమని అడుగుతుంది. నేను తినను అని చెప్తాడు. గాయం చేసి మందు రాస్తా అంటే.. రాయించుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు అని రాజ్ అంటాడు. పోనీలే పాపం అన్నం తినిపిద్దామంటే.. మాట వినడం లేదు.. మీరు అన్న ఆ మోసమే చేసి తినిపిస్తాను అని కావ్య మనసులో అనుకుంటుంది. ఇక ధాన్య లక్ష్మి, కావ్య వాళ్ల ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడి.. రాజ్ కు అన్నం తినిపించే విధంగా మాట్లాడుకుంటారు. ఇక అపర్ణ మాట రాజ్ వినడు చిన్నత్తయ్య అంటూ ప్లాన్ అమలు చేస్తాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











