Brahmamudi: కావ్యపై రాజ్‌కు ఫిలింగ్స్ మొదలు... స్వప్నకు కడుపు లేదని కనకానికి తెలిసిపోయిందా?
బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారం అవుతుంది. అయితే ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం.
అక్టోబర్ 17వ తేదీన బ్రహ్మముడి సీరియల్ లో కనకం.. స్వప్నను చూసుకునేందుకు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఇక అడుగడుగునా రుద్రాణి.. కనకంను అవమానిస్తూ ఉంటుంది. ఇక రాజ్ కలుగజేసుకుని రుద్రాణి మాటలకు కౌంటర్ ఇస్తాడు. అది చూసిన సీతారామయ్య.. రాజ్ ను మెచ్చుకుంటాడు. మరోవైపు అప్పు పెద్దమ్మతో తన ప్రేమను చెప్పుకుని బాధపడుతుంది. కనకం.. రుద్రాణి గదిలోకి పడుకోవడానికి వస్తుంది. కనకాన్ని వెళ్లగొట్టడానికి రుద్రాణి ఓ మాస్టార్ ప్లాన్ వేస్తుంది. కనకానికి ఏసీ పడదు అని తెలుసుకుని ఏసీని పెంచుతుంది. తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

అక్టోబర్ 18వ తేదీన బ్రహ్మముడి సీరియల్ లో కావ్య.. రాజ్ ను కిల్లి అడుగుతుంది. కిల్లి తినాలని ఉందని చెబుతుంది. దీంతో ఆన్ లైన్ బుక్ చేద్దామని చూస్తే.. సర్వీస్ అన్ అవైలబుల్ ఉంటుంది. ఇక కిల్లి కోసం రాజ్, కావ్య బయటకు వెళ్తారు. అక్కడ ఓ కిల్లి షాప్ తెరిచి ఉంటే.. అందులోకి వెళ్తారు. ఇక కావ్య కోసం.. ఓ కిల్లి తయారు చేసి ఇస్తాడు రాజ్. ఇక రాజ్ కోసం.. కావ్య కూడా కిల్లి ఇస్తుంది. పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తారు. ఈ లోపు ఓనర్ వచ్చి దొంగలు పడ్డాడని పోలీసులకు కాల్ చేస్తాడు. ఇక పోలీసులు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి
అక్టోబర్ 19వ తేదీన బ్రహ్మముడి సీరియల్ లో కావ్య, రాజ్ పాన్ షాప్ లో ఉండగా.. పోలీసులు వస్తారు. ఇద్దరిని పట్టుకుంటారు. మేం దొంగలం కాదు.. భార్య భర్తలం అని చెప్తుంది కావ్య. ఇక ఫ్రూఫ్ ఏంటి అని పోలీసు అడగ్గా.. ఫోటోలు చూపిస్తామని చెప్తుంది. రాజ్ ఫోన్ తీసుకురాకపోవడంతో కావ్య గొడవపడుతుంది. ఇక ఆ గొడవను చూసిన పోలీసు.. మీరు భార్య భర్తలే అని నమ్ముతున్న అంటాడు. మరోవైపు కనకం ఆ ఏసీ చలి తట్టుకోలేక రుద్రాణి చీరలను కప్పుకుని పడుకుంటుంది. తెల్లారి లేచే సరికి.. నా కాస్ట్లీ చీరలను పాడు చేశావ్ అని రుద్రాణి ఫైర్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
అక్టోబర్ 20వ తేదీన బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్.. మైఖేల్ బెయిల్ కోసం డబ్బులు ఎలా అని ఆలోచిస్తాడు. స్వప్న నగలు పెట్టుకుంటుంటే.. పోయి పది లక్షలు కావాలి అని అడుగుతాడు. దీంతో స్వప్న షాక్ అవుతుంది. లేవని చెప్తుంది. నగలు ఇవ్వు తాకట్టు పెట్టి మళ్లీ తెచ్చి ఇస్తాను అంటాడు. నేను ఇవ్వను అని చెప్తుంది స్వప్న. ఇక స్వప్న లేని టైం చూసి ఆ నగలను దొంగతనంగా తీసుకుపోతాడు రాహుల్. ఇక రాజ్ ఆపుతాడు. ప్రకాష్ వచ్చి ఆ బ్యాగును లాగడంతో నగలు అన్ని బయట పడుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
అప్పును తీసుకుని కల్యాణ్, అనామిక షాపింగ్ కు వెళ్తారు. ఇక అనామిక.. అప్పును చూసి ఎవరినో ప్రేమిస్తుందని చెప్తుంది. మా బ్రోకి అంత సీన్ లేదని కల్యాణ్ అంటాడు. ఇక అప్పు సీరియస్ అవుతుంది. అప్పును ఇంటి దగ్గర దింపే క్రమంలో కల్యాణ్, అనామికతో కలిసి రొమాన్స్ చేస్తాడు. ఇది చూసిన అప్పు బాధ పడుతుంది. మరోవైపు రాజ్.. కావ్య కోసం సేవలు చేస్తూ ఉంటాడు. ఇక కావ్యకు, రాజ్ కు ఇద్దరికీ ఫీలింగ్స్ వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి


Click it and Unblock the Notifications











