Brahmamudi: అనామిక, కల్యాణ్ పెళ్లి ఫిక్స్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య.. అప్పు పరిస్థితి ఏంటో?
బ్రహ్మాముడి సీరియల్ లో ఈ వారం కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ సీరియల్ మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
సెప్టెంబర్ 2 ఎపిసోడ్ లో కావ్య, రాజ్‌లు కలసి.. స్వప్నని ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే రుద్రాణి, రాహుల్‌లు ఇంట్లో హైడ్రామా క్రియేట్ చేయడం.. స్వప్నని చూడగానే షాక్ అవ్వడం జరగుతుంది. ఆ తర్వాత స్వప్న కడుపు చూసి ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. మరోవైపు రాహుల్ చేసిన పనికి రుద్రాణి చెంపపగులగొడుతుంది.

సెప్టెంబర్ 3 ఎపిసోడ్ లో లో కావ్య ప్లానింగ్ తో అపర్ణతోనే కనకాన్ని ఇంటికి పిలిపించుకుంటుంది. అలా పండక్కి అపర్ణ స్వయంగా కనకంకు ఫోన్ చేసేలా చేస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఇంట్లో విగ్రహం పెట్టి.. అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వారి కోరికలను చీటిల్లో రాసి.. ఒక దాంట్లో వేస్తారు. ఇక రాజ్ ఏం కోరికలు రాశారా అని... కావ్య తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ రాజ్ ఏం రాశాడు.. ఆమె ఆ చీటి చదివిందా.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సెప్టెంబర్ 4 ఎపిసోడ్ లో కావ్య తల్లిదండ్రులు దుగ్గిరాల ఇంటికి వస్తారు. అక్కడ రుద్రాణి అవమానించేలా మాట్లాడుతారు. ఇక రాజ్ కు థ్యాంక్స్ చెబుతాడు మూర్తి. దానికి రాజ్.. మీరు కావ్యకు తల్లిదండ్రులు అయితే నాక్కూడా అలాంటి వారే కదా అంటాడు. ఇక సీతారామయ్య పెంపకం గురించి మూర్తి గొప్పగా మాట్లాడుతాడు. ఇక అంతలోనే అనామికా తన పేరెంట్స్ తో కలిసి వస్తుంది. అది చూసిన కల్యాణ్, కావ్య వెళ్లి వారిని రిసీవ్ చేసుకుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సెప్టెంబర్ 5 ఎపిసోడ్ లో బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో పూజ చేసేందుకు జంటలు పోటీ పడుతుంటాయి. ఇక రాహుల్, స్వప్న.. ఆర్చరీ గేమ్ లో పాల్గొంటారు. కానీ కొట్టలేకపోతారు. ఇక స్వప్న చిరాకు పడుతుంది. నువ్వు కదలడం వల్లే కొట్టలేకపోయాను అని రాహుల్ చెప్తాడు. నేను ఎక్కడ కదిలాను అని స్వప్నఅంటుంది. ఇక నెక్ట్స్ ఎవరు అంటే నేను అని కల్యాణ్ అంటాడు. ఇక కల్యాణ్ అప్పుతో కలిసి ఆడాలి అనుకుంటాడు. కానీ అనామిక జలాసీ ఫీల్ అయి... మనం కదా జంట మనం ఆడుదాం అని చెప్తుంది. ఇక అప్పు తప్పుకుని కల్యాణ్ తో అనామిక ఆడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సెప్టెంబర్ 6 ఎపిసోడ్ లో వినాయక చవితి పూజ జరుపుకుంటారు. ఇక ఇంట్లో వాళ్లంతా డ్యాన్సులు చేస్తూ.. అలరిస్తారు. ఓ వైపు అనామిక, కల్యాణ్ జంటను చూసి.. అపర్ణ హార్ట్ అవుతుంది. ఇక మరోవైపు స్వప్న ప్రగ్నెన్సీ నాటకం బయటపడనుండగా... కావ్య కాపాడుతుంది. ఇంట్లోని వారంతా కలిసి భోజనం చేస్తారు. అక్కడ కల్యాణ్, అనామిక ప్రేమను చూసి... ఇక అప్పు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరోవైపు రాజ్ రాసిన చీటీని కావ్య చదివేందుకు తెగ ప్రయత్నం చేస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సెప్టెంబర్ 7 ఎపిసోడ్ లో ఓ వైపు అనామిక, కల్యాణ్ ప్రేమను చూసి అప్పు బాధపడుతుంది. ఇక కల్యాణ్ ప్రేమలో అప్పు పడినట్లే అని అర్థం అవుతుంది. మరోవైపు రాజ్ రాసిన చీటీని చదివిన కావ్య.. ఇంట్లోంచి వెళ్లిపోతుంది. కావ్య కోసం రాజ్ వెతికితే.. అసలు విషయం బయట పడుతుంది. ఇక కనకం వచ్చి నా కూతురు నాకు కావాలి అంటుంది. అసలు కావ్య దొరికిందా.. ఎందుకు బయటకు వెళ్లిందనే విషయాలు తెలుసుకోవాలంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











