Brahmamudi: కావ్య ప్రేమలో మునిగిపోయిన రాజ్... దుగ్గిరాల ఇంట్లోకి కనకం... స్వప్న డ్రామాకు చెక్!
బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారం అవుతుంది. అయితే ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం.
అక్టోబర్ 9వ తేదీన సీరియల్ లో కావ్య ఇంట్లో ఉండకపోవడం గమనించి... రాజ్ కావ్య కోసం వెతుకుతాడు. ఇంట్లో అందరినీ అడుగుతాడు.. కావ్య ఇంట్లో లేదని తెలుసుకుని అందరూ కంగారు పడుతుంటారు. ఇంట్లో వాళ్లంతా కావ్య ఎటు వెళ్లింది.. ఏమైనా గొడవ జరిగిందా అని రాజ్ ను ప్రశ్నిస్తారు. లేదు.. ఏ గొడవ జరగలేదు.. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది.. ఏమైందో తెలియదని రాజ్ చెప్తాడు. ఇక కావ్య కోసం వెతకమని ఇంట్లోవాళ్లని ఇందీరా దేవి ఆదేశిస్తుంది. ఇక కావ్య కోసం వెతకడానికి సుభాష్, ప్రశాష్, రాహుల్, కల్యాణ్, రాజ్ వెళ్తారు. మరోవైపు కావ్య ఓ గుడిలో కూర్చొని ఉంటుంది.

అక్టోబర్ 10వ తేదీన సీరియల్ లో రాజ్ కావ్య కోసం వెతికే ప్రాసెస్ లో ఒకవేళ తన పుట్టింటికి వెళ్లిందేమోనని అనుమానంతో కనకానికి కాల్ చేస్తాడు. ఇక కావ్య వచ్చిందా అని అడిగితే.. ఈ టైంలో ఎందుకు వస్తుంది అని అంటుంది కనకం. రాజ్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కనకానికి మళ్లీ డౌట్ వస్తుంది. ఇక కల్యాణ్ కు కాల్ చేసి... మీ అన్నయ్య మొత్తం చెప్పాడు ఏం జరిగిందో చెప్పు అంటే.. అప్పుడు అసలు విషయం తెలుసుకుంటుంది కనకం. మరోవైపు కావ్య కోసం ఎంత వెతికిన దొరక్క పోవడంతో.. అందరూ ఇంటికి వస్తారు. అప్పుడే కనకం వాళ్లు అక్కడికి వచ్చి... దుగ్గిరాల కుటుంబాన్ని ప్రశ్నిస్తారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
అక్టోబర్ 11వ తేదీ ఎపిసోడ్ లో కావ్య ఓ గుడిలో ఉన్నట్లు ఓ పూజారి సీతారామయ్యకు కాల్ చేసి చెబుతాడు. ఇక ఇందీరాదేవితో కలిసి సీతారామయ్య ఆ గుడికి వెళ్లి ఏమైందో కనుక్కుంటాడు. ఇక అక్కడ కావ్య.. రాజ్ రాసిన చీటీని సీతారామయ్యకు ఇస్తాడు. ఇక అసలు విషయం తెలుసుకున్న సీతారామయ్య ... కావ్యను ఇంటికి రమ్మని బతిమిలాడుతారు. నీ ప్రేమతోనే నీ భర్తను మార్చుకో అని ఇందిరాదేవి సలహా ఇస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి.. కావ్యను ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంట్లో వాళ్లంతా కావ్యను ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తారు. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
అక్టోబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో రాజ్ కావ్యను ఇంటికి తీసుకువస్తాడు. ఎక్కడికి వెళ్లావంటూ కనకం వాళ్లు ప్రశ్నిస్తారు. మరోవైపు అపర్ణ, రుద్రాణి సైతం కావ్య పై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కావ్య తన తల్లిదండ్రులపై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరికీ సారీ చెప్తుంది. ఇక ఇందిరాదేవి, సీతారామయ్య.. కావ్యకు ఓ మొక్కు ఉంది.. అందుకే గుడికి వెళ్లిందని కవర్ చేస్తారు. ఇక ఇందీరాదేవి, సీతారామయ్య.. ఇంట్లోకి వెళ్లమని కావ్యకు చెప్తారు. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
అక్టోబర్ 13వ తేదీ ఎపిసోడ్ కావ్య గదిలోకి వెళ్లాక రాజ్ ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు. నిజంగానే మొక్కు తీర్చుకోడానికి వెళ్లావా అంటూ ప్రశ్నిస్తాడు. అవును అని చెప్తుంది. ఇక ఇంట్లో వాళ్లు స్వప్న సీమంతం గురించి మాట్లాడుకుంటారు. ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం అంటూ చర్చించుకుంటారు. లేని కడుపు కోసం ఇంత ఆర్భాటం అవసరమా అని స్వప్న అనుకుంటుంది. ఎలాగైనా ఈ కడుపు పొగట్టుకున్నట్లు డ్రామా ఆడాలి అని నిర్ణయించుకుంటుంది. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
అక్టోబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో స్వప్న అబార్షన్ డ్రామా మొదలు పెడుతుంది. మెట్లపై నుంచి పడిపోయినట్లు చేద్దాం అనుకుంటే... అప్పుడే కావ్య వచ్చి పట్టుకుంటుంది. ఇంట్లో వాళ్లంతా స్వప్నను తిడుతారు. ఆ మాత్రం సోయి లేదా అని చీవాట్లు పెడతారు. ఇక స్వప్న కోసం ఓ నర్సును ఏర్పాటు చేయాలనుకుంటారు. స్వప్న టెన్షన్ పడుతుంది. మరోవైపు కావ్య కాలు బెణకడంతో.. రాజ్ సేవలు చేస్తాడు. మరుసటి రోజు.. కనకం దుగ్గిరాల ఇంటికి వస్తుంది. స్వప్నను తీసుకువెళ్తాను అంటే... వాళ్లంతా ఓ షాక్ ఇస్తారు. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











