Janaki Kalaganaledu Weekly Roundup: అనుకున్న లక్ష్యాన్ని దగ్గరగా చేరిన జానకి.. తట్టుకోలేని మల్లిక
జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జూన్ 26 నుంచి జూలై 1 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
జూన్ 26వ ఎపిసోడ్: జానకి నిందితుడి అడ్రస్ కనుక్కొని అతని ఇంటికి వెళుతుంది. అయితే ఇంతకుముందు జానకి ఆ ఇంటికి వెళ్లినట్లు గమనిస్తుంది. కాలింగ్ బెల్ కొట్టగానే ఒక యువతి డోర్ తెరుస్తుంది. ఆమె ఇంతకుముందు జానకికి కనపడుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకున్న యువతికి జానకి మంచి మాటలు చెప్పి ధైర్యం చెబుతుంది. అయితే ఆమెను అక్కడ చూడడంతో జానకి సంతోషపడుతుంది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడగగానే జానకి ఫోటో చూపిస్తుంది.

అతను మా అన్నయ్య అని చెప్పడంతో ఒకసారి బయటకు పిలవాలి అని జానకి చెబుతుంది. ఇక అతను దూరం నుంచి జానకి రామచంద్రలను చూసి పారిపోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇక రామచంద్ర అతన్ని పట్టుకుని అసలు నిజం చెప్పాలని అంటాడు. అతని తల్లి కూడా అతన్ని కొడుతుంది. ఇక మరొక వ్యక్తి తనను ఈ విధంగా నాటకం ఆడించాడు అని చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. ఇక జానకి అతను ఎవరో గుర్తుపడతావా అని అడగగానే అతను గుర్తుపడతానని చెబుతాడు. ఇక జానకి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సాంబశివరావును పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పాలి అని డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెబుతుంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
జూన్ 27వ ఎపిసోడ్: అయితే తమ వదిన గురించి ఆ విధంగా మాట్లాడొద్దు అని విష్ణు తో పాటు అఖిల్ కూడా చెప్తాడు. ఇక వారు అందరూ అలా మాట్లాడుతున్న సమయంలో అప్పుడే జానకి భర్తతో కలిసి వస్తుంది. ఎంతో సంతోషంగా అమ్మవారికి నమస్కరిస్తూ అసలు విషయం చెబుతుంది. నిజం నిరూపించాను అని చెప్పడంతో అత్తమామ గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు.
ఇక వెంటనే నీలావతి మాట మార్చేసి.. నీ గురించి నాకు తెలుసు జానకి తప్పకుండా నువ్వు ఈ విధంగా తిరిగి వస్తావు అని అనుకుంటున్నాను ఆమె మాట మారుస్తుంది. ఇక జరిగిన విషయాన్ని మొత్తం జానకి అందరికీ చెబుతుంది. ఇక జానకి తెలివిని చూసి జ్ఞానాంబ కూడా ఎంతగానో సంతోషపడుతుంది. ఇక రేపు జానకి గారు ఐపీఎస్ ట్రైనింగ్ కు వెళ్లబోతున్నారు అని కూడా చెబుతాడు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
జూన్ 28వ ఎపిసోడ్: ఉదయాన్నే అత్తగారు జానకి కోసం ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. జానకి అక్కడ ఎలాంటి తిండి పెడతారో అని ఆమె స్పెషల్ గా స్వీట్లు తయారు చేస్తూ ఉంటుంది ఇక రెడీ చేస్తున్న సమయంలోనే గోవిందరాజులు వచ్చి ఇలా చేయకూడదు అని జానకి వెళ్ళేది ఐపిఎస్ ట్రైనింగ్ కు అని నువ్వు ఇలా స్వీట్లు అవి పెడితే అక్కడ ఒప్పుకోరు అని చెబుతాడు. అయినప్పటికీ కూడా జ్ఞానాంబ బాగానే సిద్ధం చేస్తూ ఉంటుంది.
ఇక మరోవైపు మల్లిక కావాలని కొన్ని స్వీట్లు పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన కొంగు చాటున వాటిని దాచుకుంటూ ఉంటుంది. అయితే పనివాడు మలయాళం చుస్తాడు. దీంతో మల్లికా నోరు మూసుకోవాలని అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక చివరికి మలయాళం తెలివిగా మీ పక్కన బల్లి అంటూ హఠాత్తుగా చెప్పడంతో మల్లికా భయపడి లేస్తుంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
జూన్ 30వ ఎపిసోడ్: ఇక జానకితో బస్ స్టాప్ వరకు రావడంతో రామచంద్ర ఆమెను పంపించేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. 11 నెలలు మిమ్మల్ని వదిలి ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అని అతను తన మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక జాగ్రత్తగా ఉండాలి అని జానకి అతనికే ఎంతో ప్రేమగా చెబుతూ ఉంటుంది. ఇక జానకి ఫైనల్ గా బస్సు ఎక్కగా రామచంద్ర దీనంగా ఆమెను చూస్తూ ఉంటాడు. ఇక ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాడు.
అలాగే జానకి కూడా భర్తతో ఇన్నేళ్లు గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చివరికి వీడ్కోలు పలికి వెళ్ళిపోతుంది. ఇక గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కూడా జానకి వెళ్ళిపోయింది అని.. మరి రామచంద్ర ఎలా ఉంటాడో అని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక రామచంద్ర రాగానే తనకు అలాంటి బాధ ఏమీ లేదు అని చెబుతాడు. కానీ అతను మలయాళం పిలిచినా కూడా జానకి పిలిచిందేమో అని అనుకుంటాడు. దీంతో తల్లిదండ్రులు కూడా కొంత అప్సెట్ అవుతారు. ఇక సైలెంట్ గా ఏమీ అనకుండా రామచంద్ర ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
జూలై 1వ ఎపిసోడ్: ఇక రామచంద్ర తన భార్యకు ఫోన్ చేయాలని అనుకుంటాడు. మరోవైపు జానకి కూడా ఫోన్ చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామచంద్ర ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది అని చెబుతుంది. ఇక కొంత సేపటి తర్వాత జానకి తన అనుకున్న ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్ కు చేరుకుంటుంది.
అక్కడ జానకి తన జీవితంలో కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటుంది. తన తండ్రి అలాగే రామచంద్ర ఐపీఎస్ కావాలని అనుకున్నారు. ఇప్పుడు వారి కోరికకు తగ్గట్టుగా నేను సిద్ధమవుతున్నాను అని జానకి గర్వంగా ఫీల్ అవుతుంది. మరి జానకి ముందు రోజుల్లో ఏవిధంగా కొనసాగుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











