X
తెలుగు » సినిమాలు » శాకుంతలం
శాకుంతలం

శాకుంతలం

Fantasy | 14 Apr 2023 | U/A | 142 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

శాకుంతలం స్టోరీ

శాకుంతలం సినిమా ఫాంటసీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమంత అక్కినేని, దేవ్ మోహన్ , అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు తదితరులు నటించారు. ఈ  సినిమాకి దర్శకత్వం గుణశేఖర్ వహించారు.  నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు . సంగీతం మణి శర్మ అందించారు.  రిలీజ్   ఏప్రిల్‌ 14న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది  స్టోరీ  విశ్వామిత్రుడి తపస్సు భంగం కలిగించడానికి భూమిపైకి వచ్చిన మేనక (మధుబాల) ఇంద్రుడు (జిషుసేన్ గుప్తా) ప్లాన్‌లో భాగంగా అతడితో ప్రేమలో పడి ఓ బిడ్డను కంటుంది. దేవలోకానికి మానవుల ప్రవేశం లేకపోవడం వల్ల బిడ్డను అడివిలోనే వదిలేసి వెళ్తుంది. అనాధగా మారిన బిడ్డను కన్వ మహర్షి (సచిన్ ఖేడ్కర్) చేరదీసి శాకుంతల అని పేరు పెడుతాడు. ఆ ప్రాంతానికి వచ్చిన దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) శాకుంతల తొలి చూపులోనే ఒకర్నికొకరు ప్రేమించుకొని గాంధర్వ వివాహం చేసుకొంటారు. ఆ తర్వాత తన రాజ్యానికి వెళ్లి అధికారికంగా పట్టపు రాణి చేసుకొంటానని మాటిచ్చి గర్బవతిగా ఉన్న శాకుంతలను కన్వ మహర్షి ఆశ్రమంలో వదిలేసి వెళ్తాడు. అయితే కన్వ మహర్షి ఇంటికి దుర్వాస మహాముని (మోహన్ బాబు) తనను ఓ కారణంగా అవమానించిందని శాకుంతలను శపిస్తాడు. శకుంతలను దుర్వాస ముని ఎందుకు శపించాడు? దుర్వాస ముని శపించిన తర్వాత శకుంతల జీవితంలో ఎలాంటి పరిస్థితులు సంభవించాయి. తనను భర్తగా స్వీకరించమని దుష్యంత మహారాజు వద్దకు వెళ్లిన శకుంతలకు ఏం జరిగింది? శకుంతలను భార్యగా స్వీకరించడానికి దుష్యంతుడు ఎందుకు నిరాకరించాడు? శకుంతలకు శాప విమోచనం ఏమిటి? దుష్యంతుడికి రాక్షస సేనకు శతృతం వెనుక కారణం ఏమిటి? చివరకు శకుంతలను దుష్యంతుడు స్వీకరించాడా? శకుంతలకు పుట్టిన కొడుకు సర్వదమన్ (అల్లు అర్హ)ను వారసుడిగా స్వీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే శాకుంతలం సినిమా  ట్రైలర్  ట్రైలర్‌ను చూస్తే గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. పులితో దేవ్ మోహన్ పోరాడే సీన్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు మెస్మరైజ్ చేశాయి… ‘శాకుంతలం’ లో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు నటించారు.
Read More

శాకుంతలం కాస్ట్ & క్రూ

శాకుంతలం సిబ్బంది సమాచారం

దర్శకత్వం గుణశేఖర్
డైలాగ్ సాయి మాధవ్ బుర్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు ప్రవీన్ పుది
సంగీతం మణిశర్మ
నిర్మాత నీలిమా గుణ, దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శాకుంతలం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
శాకుంతలం కథ అద్బుతమైన అమర ప్రేమకావ్యం. కానీ ఎమోషన్స్ లేకుండా చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. నేటి తరానికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అజరామరమైన ప్రేమకథను చెప్పే ప్రయత్నాన్ని గుణశేఖర్ మెచ్చు కోవాల్సిందే. అయితే గొప్ప ఫీలింగ్ అందించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. గ్రాఫిక్ వర్క్ సరిగా లేని కారణంగా సినిమాకు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుుంది. సమంత ఫెర్ఫార్మెన్స్, గ్రాండియర్‌గా తెర మీద కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పాజిటివ్‌గా నిలిచాయి. కథ పరంగా, సాంకేతిక అంశాల పరంగా ఉన్న చాలా లోపాలను పక్కన పెడితే.. ముఖ్యంగా నేటితరం, చిన్న పిల్లలకు చూపించాల్సిన సినిమా. ఓసారి చూడదగిన సినిమా శాకుంతలం.

శాకుంతలం ట్రైలర్

Video Thumbnail

శాకుంతలం పాటలు

శాకుంతలం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శాకుంతలం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+