X
తెలుగు » సినిమాలు » సత్తి గాని రెండెకరాలు
సత్తి గాని రెండెకరాలు

సత్తి గాని రెండెకరాలు

Comedy | Drama | 17 Mar 2023 | U/A |
Telugu

2.8 /5 Users

2 /5 Filmibeat

సత్తి గాని రెండెకరాలు స్టోరీ

సత్తి గాని రెండెకరాలు సినిమా కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగదీశ్, అనీషా దామ, మోహన శ్రీ సురగ, రాజ్ తిరందాసు, బిత్తిరి సత్తి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అభినవ్ దందా వహించారు. సంగీతం జై క్రిష్ అందించారు.  కథ రెండు ఎకరాల భూమికి ఆసామీ సత్తి (జగదీష్ ప్రతాప్ బండారీ) బతుకు తెరువు కోసం ఆటో నడుపుకొంటూ భార్య, ఇద్దరు పిల్లల్ని పోషించుకొంటు ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా భూమిని అమ్మకూడదని తాత చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటాడు. బతుకు తెరువే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తన కుమార్తె గుండెలో రంధ్రం ఉందని తెలియడం, దాని ఆపరేషన్‌కు 30 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు. ఈ క్రమంలో భూమిని అమ్మలేని పరిస్థితుల్లో.. ఓ కారులో నుంచి సూట్ కేస్ దొంగతనం చేస్తాడు. కారులో నుంచి దొంగిలించిన సూట్ కేస్‌ను ఒపెన్ చేయడానికి తన స్నేహితుడు అంజి (రాజ్ తిరన్ దాస్)తో సత్తి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సూట్ కేస్ కోసం షిప్పింగ్ బిజినెస్ ఓనర్ లలిత్ (రియాజ్) తన అనుచరులకు ఎందుకు పురమాయిస్తాడు? రైడర్ (వెన్నెల కిషోర్) సూట్ కేస్ కోసం వెతుకుతూ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఈ వ్యవహారంలో ఎస్సై నిరంజన్ రెడ్డి (బిత్తిరి సత్తి) ఎలా దర్యాప్తు చేస్తాడు? సత్తిని మోసం చేయాలని చూసిన సర్పంచ్ (మురళీధర్ గౌడ్)కు ఎలాంటి అనుభవం ఎదురైంది? సత్తి రెండెకరాల భూమిని అమ్మాడా? సత్తి, అంజికి సూట్‌కేసు ఎలాంటి కష్టాలు తెచ్చి పెట్టింది? తన కూతురుకు అంజి వైద్యం చేయించాడా? చివరకు సూట్‌కేసు వ్యవహారం సత్తికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే సత్తిగాని రెండు ఎకరాలు సినిమా. 
Read More

సత్తి గాని రెండెకరాలు కాస్ట్ & క్రూ

సత్తి గాని రెండెకరాలు సిబ్బంది సమాచారం

దర్శకత్వం అభినవ్ దందా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జై క్రిష్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సత్తి గాని రెండెకరాలు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
తెలంగాణ, రూరల్ బ్యాక్ డ్రాప్‌తో చైల్డ్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం అంశాలను అందించే ప్రయత్నంగా రూపొందిన చిత్రం సత్తిగాని రెండు ఎకరాలు. అయితే తెలంగాణ యాస, భాష ఉంటే సరిపోతుందనుకొంటే పొరపాటే అనేది ఈ సినిమా చెప్పింది. కథ, కథనాలు, ఎమోషనల్ సీన్లపై కసరత్తు చేసినట్టు కనిపించదు. దాంతో మంచి వినోదానికి, భావోద్వేగాలకు స్కోప్ ఉన్న చిత్రం ఎమోషన్స్ పండకపోవడం, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో సాదాసీదాగా మారిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. రూరల్ బ్యాక్ డ్రాప్‌, కామెడీ చిత్రాలను ఇష్టపడే వారికి సత్తిగాని రెండు ఎకరాలు నచ్చే అవకాశం ఉంది.

సత్తి గాని రెండెకరాలు ట్రైలర్

Video Thumbnail

సత్తి గాని రెండెకరాలు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

సత్తి గాని రెండెకరాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+