X
తెలుగు » సినిమాలు » వీర సింహా రెడ్డి
వీర సింహా రెడ్డి

వీర సింహా రెడ్డి

Action | 12 Jan 2023 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

వీర సింహా రెడ్డి స్టోరీ

వీర సింహా రెడ్డి  మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  బాలకృష్ణ ,  శృతి హాసన్ , దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోస్, లాల్, చంద్రిక రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మలినేని వహించారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. సంగీతం థమన్ ఎస్ అందించారు.  వీర సింహా రెడ్డి ఫ్యాన్స్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కథ కర్నూలులోని పులిచర్ల ప్రాంతంలో ఫ్యాక్షన్ అరాచకాలు, పగ, ప్రతీకారాలకు వ్యతిరేకంగా వీరసింహారెడ్డి (బాలకృష్ణ) కత్తి పడుతాడు. తన సోదరి భానుమతి (వరలక్ష్మీ), ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) దంపతులతో వైరం కొనసాగుతుంటుంది. ప్రతాప్ రెడ్డి తనను చంపడానికి ప్రయత్నించినప్పటికీ.. చెల్లెలిపై ప్రేమ కారణంగా బావను క్షమించి వదిలేస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల వీరసింహారెడ్డికి తన జీవిత భాగస్వామి మీనాక్షి (హనీ రోజ్), జై సింహారెడ్డి (బాలకృష్ణ) దూరంగా ఇస్తాంబుల్‌లో బతుకుతుంటారు. చాలా ఏళ్ల తర్వాత తన ఫ్యామిలీని కలుసుకొనేందుకు ఇస్తాంబుల్‌కు వెళ్లిన వీరసింహారెడ్డిని టార్గెట్ చేసి భానుమతి, ప్రతాప్ రెడ్డి దాడి చేస్తారు. వీరసింహారెడ్డిపై చెల్లెలు భానుమతి ఎందుకు విద్వేషం పెంచుకొన్నది? వీరసింహారెడ్డితో భానుమతి బంధం ఎలాంటింది? వీరసింహారెడ్డికి జీవిత భాగస్వామి మీనాక్షి ఎందుకు దూరంగా బతుకుతుంది? ఏ పరిస్థితుల్లో వీరసింహారెడ్డి రాయలసీమను వదిలేసి ఇస్తాంబుల్ వెళ్లాల్సి వచ్చింది. ఇస్తాంబుల్‌లో వీరసింహారెడ్డిని కలిసిన కుమారుడు జై సింహారెడ్డి ఆలోచనల్లో మార్పుకు ఎలాంటి సంఘటన కారణమైంది? ఇషా (శృతిహాసన్), జై సింహారెడ్డి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది? తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ముందడుగు వేసిన జై సింహారెడ్డికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? తన అన్న వీరసింహారెడ్డికి ద్రోహం చేసిన భానుమతి ఎలాంటి శిక్షను విధించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే వీరసింహారెడ్డి సినిమా కథ. రిలీజ్ సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తారీఖున సినిమా రిలీజ్ కానుంది.  ట్రైలర్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్  ఒంగోలులో ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేసింది..ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.   వీర సింహా రెడ్డి మూవీ డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి      
Read More

వీర సింహా రెడ్డి కాస్ట్ & క్రూ

వీర సింహా రెడ్డి సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోపిచంద్ మలినేని
డైలాగ్ సాయి మాధవ్ బుర్ర
సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్, సి వి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వీర సింహా రెడ్డి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సంక్రాంతి పండుగ సెలవులను, ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ హంగులు, బాలకృష్ణకు కలిసొచ్చే ఫ్యాక్షన్ కథతో రూపొందిన చిత్రం వీరసింహారెడ్డి, అన్నాచెల్లెల్ల అనుబంధం, పుట్టిన గడ్డపై శాంతి నెలకొల్పడానికి కత్తి పట్టి రుద్రతాండవం చేసిన రాయలసీమ బిడ్డ కథగా తెరకెక్కింది. లాజిక్స్‌కు దూరంగా, వాస్తవానికి భిన్నంగా.. కేవలం సినీ ప్రేక్షకుల అభిరుచిని, అభిమానుల ఇగోను సంతృప్తి పరచడానికి రాసుకొన్న సన్నివేశాలు వీరసింహారెడ్డికి అదనపు బలంగా మారాయి. కత్తిపట్టి నరకడమనేది బాలకృష్ణకే చెల్లుతుందని మరోసారి నిరూపించే చిత్రం ఇది. మాస్, మసాలా, యాక్షన్, సెంటిమెంట్, క్యారెక్టర పరంగా హీరోయిజం ఇష్టపడే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. సంకాంత్రి సీజన్‌లో రికార్డులు తిరగరాసే కలెక్షన్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. బాక్సాఫీస్ పరంగా ఏ రేంజ్ హిట్ అనేది కొద్ది రోజులు ఆగితే స్పష్టమవుతుంది.

వీర సింహా రెడ్డి ట్రైలర్

Video Thumbnail

వీర సింహా రెడ్డి పాటలు

Music Director: తమన్ యస్

వీర సింహా రెడ్డి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వీర సింహా రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+