ఒకప్పుడు సినిమాల్లో హీరోలకు ధీటుగా యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిన్స్ మెప్పించేవారు. కానీ ఆ తర్వాత బ్యూటీ డాల్స్ ఎక్కువగా గ్లామరస్ పాత్రలకే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ కథానాయికలు యాక్షన్ సన్నివేశాల్లో నటించటానికి ఆసక్తి చూపటం కాదు..ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ నటిస్తున్నారు.ఇది నిజంగా అభిమానులను అలరిస్తోంది. అది కూడా పెళ్లైన హీరోయిన్స్ అయితే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేస్తున్నారు. మరి పెళ్లి తర్వాత యాక్షన్ సీక్వెన్సుల్లో నటిస్తూ మెప్పించే ముద్దుగుమ్మలెవరనే వివరాల్లోకి వెళితే..