పవర్ స్టార్ వీరాభిమాని నిరంజన్ మృతి.. తీవ్ర విషాదంలో పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ కన్నుమూశాడు. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ గత కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాతున్నాడు. ఇటీవల అతని ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కానీ, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.ఈ వార్త తెలిసిన వెంటనే జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాలతో నివాళులర్పిస్తున్నారు.

Also Read
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..

నిరంజన్ పుట్టుకతోనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి కారణంగా అతడి శారీరక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింది. వయసు పెరుగుతున్నా శరీరం పెరుగుదల లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు.అయితే.. అతనికి పవన్ కళ్యాణ్‌పై అమితమైన అభిమానం. ఒకసారి అయినా తన అభిమాన హీరోను ప్రత్యక్షంగా కలవాలనే కోరికను ఉండేది. నిరంజన్ కోరిక సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది.

Recommended For You
ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్
ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్
Pawan Kalyan s Young Fan Niranjan Dies

ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెలలో హనుమకొండలోని నిరంజన్ ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. మంచంపైనే ఉన్న నిరంజన్ పక్కన కూర్చుని ఆప్యాయంగా పలకరించారు. అతడి చేతిని పట్టుకుని ధైర్యం చెప్పారు. "అధైర్యపడకు.. మంచి చికిత్స తీసుకుంటే తప్పకుండా కోలుకుంటావు" అంటూ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. నిరంజన్‌తో సెల్ఫీ తీసుకుని, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. జనసేన డైరీపై తన చేతిరాతతో ప్రత్యేక సందేశం రాసి బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా కుటుంబానికి రూ.1 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించారు.

You May Also Like
 Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?

ఆ సందర్భంగా నిరంజన్ తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలనే కోరిక ఉందని పవన్‌కు చెప్పాడు.'వెంటనే కొని పంపిస్తా చిన్నా' అంటూ పవన్ హామీ ఇచ్చారు. అదే రోజు అతని కోరికను నెరవేర్చారు.ఆ సమయంలో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కొడుకు చిరకాల కోరిక నెరవేరిందని అతని తల్లిదండ్రులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.

నాగార్జున 'కింగ్-100'లో బిగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా స్టార్ హీరోయిన్!
నాగార్జున 'కింగ్-100'లో బిగ్ ట్విస్ట్.. పవర్‌ఫుల్ విలన్‌గా స్టార్ హీరోయిన్!

ఇక నిరంజన్‌ను పవన్ కళ్యాణ్ పలుకరించిన తరువాత ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి, ఆ కుటుంబానికి అండగా నిలిచారు. పలువురు జనసేన నాయకులు, అభిమానులు కూడా నిరంజన్ కుటుంబాన్ని అండగా నిలిచారు. అతనికి మనసికంగా భరోసా అందించారు.

కొడుకు కోసం కాజల్ సంచలన నిర్ణయం... ఇకపై అలాంటి సినిమాలే టార్గెట్..
కొడుకు కోసం కాజల్ సంచలన నిర్ణయం... ఇకపై అలాంటి సినిమాలే టార్గెట్..

తాజాగా నిరంజన్ ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి క్రమంగా దిగజారింది. పరిస్తితి విషమించడంతో మంగళవారం రాత్రి నిరంజన్ తుదిశ్వాస విడిచాడు. నిరంజన్ మరణ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. చిన్నారి నిరంజన్ మరణ వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది.

Read more about: pawan kalyan niranjan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X