అభినయ శ్రీ
Born on
అభినయ శ్రీ బయోగ్రఫీ
అభినయ శ్రీ మొదటగా తమిళ చిత్రంలో నటించింది. 2001లో వచ్చిన తమిళ కామెడీ చిత్రం ఫ్రెండ్స్మూవీలో సిద్ధికీ అనే పాత్రతో గుర్తింపు పొందింది. ఇందులో ఆమె విజయ్, సూర్యతో కలిసి నటించింది. ఆ తర్వాత నాగార్జున, సుమంత్ కలిసి నటించిన చిత్రం స్నేహమంటే ఇదేరా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అభినయ శ్రీ. అనంతరం మూడేళ్లకు అంటే 2004లో ఆర్య సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించి పాపులారిటీ దక్కించుకుంది.
2005లో తెలుగు కామెడీ సినిమా హంగామాలో ఒక హీరోయిన్గా చేసింది. పైసాలో పరమాత్మ అనే సినిమాలో పోషించిన పాత్రకు బెస్ట్ఫీమేల్కమెడియన్గా నంది అవార్డు అందుకుంది అభినయ శ్రీ.
2007లో వచ్చిన ఆదివారం ఆడవాళ్లకు సెలవు సినిమాతో పూర్తి స్థాయి సపోర్టింగ్రోల్లో కనిపించింది. ఆతర్వాత ఐటమ్ సాంగ్స్‌లో నర్తించలేదు అభినయ శ్రీ.