CelebsbredcrumbKadri Venkata Reddy
  కదిరి వెంకట రెడ్డి

  కదిరి వెంకట రెడ్డి

  Director/Producer
  Born : 01 Jul 1912
  కదిరి వెంకటరెడ్డి (1912 జూలై 1- 1972 సెప్టెంబర్ 15) అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. ఈయన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.  అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు... ReadMore
  Famous For
  కదిరి వెంకటరెడ్డి (1912 జూలై 1- 1972 సెప్టెంబర్ 15) అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. ఈయన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.  అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.

  కె వి రెడ్డి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో మెట్రిక్, డిగ్రీ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై, చిన్న వ్యాపారం చేస్తూండగా మూలా నారాయణస్వామి పిలవగా సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించాడు.

  అతని విజయవంతమైన సినిమాల్లో మాయాబజార్ (1957) వంటి పౌరాణిక నేపథ్యం ఉన్న చిత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), శ్రీకృష్ణసత్య (1972) వంటి పౌరాణిక...
  Read More
  • 1
   కెవి రెడ్డి గారి అసలు పేరు కదిరి వెంకటరెడ్డి. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర్లో ఉన్న తెళ్ళమిట్టపల్లే లో 1912వ సంవత్సరంలో జూలై 1వ తేదీన జన్మించారు. కొండారెడ్డి, వెంకట రంగమ్మ వారి తల్లిదండ్రులు.
  • 2
   కెవి రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండే వాడట. తన చిన్నతనం నుంచే సినిమాల మీద బాగా ఇష్టం పెంచుకున్న ఆయన తన స్నేహితుడు మూలా నారాయణస్వామి సహాయంతో 1938 లో గృహలక్ష్మి అనే సినిమాకు క్యాషియర్ గా పని చేశారు.
  • 3
   ఆ తరువాత వాహినీ సంస్థ వారు నిర్మించిన వందేమాతరం అనే సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు ఆ సినిమాకు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వం వహించారు.
  • 4
   అక్కడే ఆయనకు పౌరాణిక బ్రహ్మ అని అనిపించుకున్న ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు పరిచయమయ్యారు ఇద్దరు కలిసి వందేమాతరం సినిమాకి సహాయ దర్శకులుగా పని చేశారు.
  • 5
   కె.వి.రెడ్డి గారు వాహినీ సంస్థ లోనే సుమంగళి, దేవత స్వర్గసీమ, లాంటి సినిమాలకి క్యాషియర్, మేనేజర్ గా పని చేస్తూ వచ్చారు.తాను ప్రొడక్షన్ మేనేజర్ గా క్యాషియర్ గా పనిచేస్తున్నా కూడా కె.వి.రెడ్డి గారి మనసు ఎప్పుడు రచన-దర్శకత్వం మీదే ఉండేది.
  • 6
   1942లో ఎట్టకేలకు ఆయన కల ఫలించి భక్త పోతన అనే సినిమా కు దర్శకత్వం వహించారు. ఆ సినిమా పెద్ద హిట్ అవడం వల్ల కెవి రెడ్డి గారి కి మంచి పేరు వచ్చింది.
  • 7
   మళ్ళీ 1947లో యోగి వేమన అనే సినిమా చేశారు అది ఆర్థికంగా ఆడకపోయినా కానీ ప్రపంచ వ్యాప్తంగా గొప్ప క్లాసిక్ సినిమా అన్న పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
  • 8
   ఇక 1951 లో విడుదలైన పాతాళ భైరవి సినిమా తెలుగు సినిమా నే మార్చేసింది కెవి రెడ్డి గారికి గొప్ప పేరును సంపాదించి పెట్టింది. చందమామ కథల పుస్తకం లో ఉన్న ఒక చిన్న కథ నుంచి లైను తీసుకొని పాతాళభైరవి సినిమా కథని చేశారు.
  • 9
   ఈ సినిమాలోని మాటలు సాహసం చేయరా డింభకా రాకుమారి లభించునురా అన్న మాటలు, కలవరమాయే నా మదిలో ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు లాంటి పాటలు ఆంధ్ర దేశమంతటా బాగా ప్రాచుర్యం పొందాయి.
  • 10
   ఆ తర్వాత నుంచి కె.వి.రెడ్డి గారు ఇక వెనుదిరిగి చూసుకోలేదు పెద్ద మనుషులు, దొంగరాముడు, మాయాబజార్ పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరునికథ, శ్రీకృష్ణార్జునయుద్ధం సత్యహరిచంద్ర ఉమా చండీ గౌరీ శంకరుల కథ భాగ్యచక్రం , శ్రీకృష్ణసత్య ఇలా ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
  • 11
   పాతాళభైరవి, మాయాబజార్ సినిమాలని వాహినీ సంస్థ తమిళ్ లో రీమేక్ చేస్తే వాటికి కె.వి.రెడ్డి గారి దర్శకత్వం గారే వహించారు.
  • 12
   గుణసుందరి కథ, దొంగరాముడు సినిమాలకి కె.వి.రెడ్డి గారు స్క్రీన్ ప్లే అందించారు. అలాగే దొంగరాముడు, మాయాబజార్ ఈ రెండు సినిమాలకి స్వయంగా ఆయనే కథ రాశారు.
  • 13
   కెవి రెడ్డి గారు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కథాబలం ఉన్నవే. కథ ఎత్తుగడ ఎలా ఉండాలి దాన్ని ఎలా నడపాలి దాని ముగింపు ఎంత అర్థవంతంగా ఉండాలి అన్నది కె.వి.రెడ్డిగారి సినిమాల్ని గమనిస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తాయి.
  • 14
   ఆయన తీసే ఏ సినిమాని అయినా ఒక యజ్ఞంలా భావించేవారు అకుంఠిత దీక్ష సృజనాత్మక పరిశీలన పట్టుదల క్రమశిక్షణతో చేసేవారు.
  • 15
   సమాజానికి ఉత్తమ సంస్కార విలువలు ఉన్న సినిమాలను అందించడమే ఆయన విజయానికి ప్రధాన కారణం. దొంగ రాముడు లాంటి సినిమా స్క్రీన్ ప్లేని పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠంగా చేర్చారు అంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
  • 16
   తెలుగు సినిమా చరిత్రలో మల్టిపుల్ క్లైమాక్స్ లను మనం ప్రప్రథమంగా దొంగరాముడు సినిమాలోనే చూస్తాం. పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి సినిమాలలో ఆకాలం లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ ను తీసుకు వచ్చిన ఆయన విజన్, సృజనాత్మకతచాలా గొప్పవి.
  • 17
   సినిమాకు సంబంధించినంత వరకు ఆయన ప్రతి షాట్ ముందుగానే కంపోజ్ చేసుకునేవాడు. సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ముందుగా తమ డైలాగుల్ని కచ్చితంగా కంఠస్థం చేయవలసిందే. విలన్ దగ్గర్నుంచి కామెడీ ఆర్టిస్ట్స్ ల వరకు సినిమాలో తమకు ఉన్న ప్రతి డైలాగును కె.వి.రెడ్డి గారు ముందు ఒకసారి రిహార్సల్స్ చేసి చూపవలసిందే.
  కదిరి వెంకట రెడ్డి వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X