twitter

    ఎస్ పి శైలజ బయోగ్రఫీ

    ఎస్.పి.శైలజ భారతీయ సినిమా గాయని, నటి, డబ్బింగ్ కళాకారిణి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. 

    అన్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు. ఈమె ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు మరియు శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.


    ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది పట్నం వచ్చిన పతివ్రతలు. అందులో ఆమె రాధిక గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. ఆ తర్వాత వసంత కోకిలలో శ్రీదేవి గారికి, నిన్నే పెళ్లాడుతా మరియు మురారి చితాలల్లో టబుకి కూడా ఈమే డబ్బింగ్ చెప్పింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X