@నర్తనశాల స్టోరి

    @నర్తనశాల సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య,  కాశ్మీర పర్దేషి, యామిని భాస్కర్, శివాజి రాజా, అజై, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస చక్రవర్తి అందించారు మరియు నిర్మాత ఉషా ముల్పురి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాగర్ మహతి అందించారు. 

    కథ

    కళామందిర్ కల్యాణ్ (శివాజీ రాజా) తన కుమారుడి రాధాకృష్ణ (నాగశౌర్య)ని చిన్నతనం నుంచే అమ్మాయిలా పెంచుతాడు. అమ్మాయిల్లో ధైర్యం నింపే విధంగా రకరకాల శిక్షణలిస్తూ కాలం గడిపే రాధాకృష్ణ ఓ సమస్యలో పడిన మానస (కశ్మీరా పరదేశి)కు దగ్గరవుతాడు. మానస సమస్యను తీర్చే క్రమంలో ఆమెతో ప్రేమలో పడుతాడు. కానీ అంతలోనే జయప్రకాశ్ కూతురు సత్య ( యామిని భాస్కర్)‌తో నిశ్చితార్థానికి సిద్ధమవుతాడు. అయితే తనకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను కొజ్జా (గే) అని రాధాకృష్ణ చెబుతాడు. ఇది విని అబ్బాయితో జీవితం పంచుకోవాలనుకొంటున్న సత్య సోదరుడు (అజయ్).. రాధాకృష్ణ ను పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. నాగశౌర్యను తన తండ్రి కళామందిర్ కల్యాన్ ఎందుకు అమ్మాయిలా పెంచుతాడు? మానసకు ఎదురైన సమస్య ఏమిటి? నాగశౌర్య తాను కొజ్జ అని చెప్పడానికి కారణమేమిటి? నాగశౌర్యను పెళ్లి చేసుకోవాలనుకొంటున్న అజయ్ కథ చివరికి ఏమైంది? మానస, సత్యలో ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు? ఇందులో జయప్రకాశ్ పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే @నర్తనశాల చిత్ర కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie @నర్తనశాల with us? Please send it to us (popcorn@oneindia.co.in).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X