10th క్లాస్ డైరీస్ స్టోరి

    10th క్లాస్ డైరీస్ సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీరామ్, అవికా గోర్, అచ్యుత రామారావు, మన్యం రవితేజ, శ్రీనివాస రెడ్డి, హిమజ, అర్చన, శివ బాలాజీ తదితరులు నటించారు.  సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన  అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం సంగీతం అందించారు. 

    కథ
    సోము అలియాస్ సోమయాజి (శ్రీరాం) అమెరికాలో స్వయంకృషితో ఎదిగి కంపెనీకి సీఈవోగా సేవలందిస్తుంటాడు. కానీ జీవితంలో సుఖసంతోషాలకు దూరంగా బతుకుతుంటాడు. ఈ క్రమంలో సైక్రియాటిస్టు వద్దకు వెళితే.. నీవు అన్ని రకాలుగా సంపాదించావు. కానీ నీ జీవితంలో ఫన్ లేదని చెబుతాడు. అయితే తన జీవితంలో ఎప్పుడో వదిలేసిన ఫన్‌ను వెతుక్కొనే ప్రయత్నంలో పడి తన పదో తరగతి క్లాస్‌ మెట్స్‌ను కలిసేందుకు అమెరికా నుంచి రాజమండ్రికి చేరుకొంటారు. రాజమండ్రికి చేరుకొన్న తర్వాత సోముకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చిన్నతనంలో తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన చాందినీ (అవికా గోర్) ఏమైంది? చిన్నతనంలో చాందినీ ప్రేమను తెలుసుకొన్న తండ్రి (నాజర్) ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? తండ్రి తీసుకొన్న తీవ్రమైన నిర్ణయం చాందినీ జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనైంది. చాందినీని సోము కలుసుకొన్నాడా? చాందిని పరిస్థితి ఏమైంది? చాందిని జాడ కోసం వెతికే క్రమంలో స్నేహితులు సౌమ్య (అర్చన వేద), నాగలక్ష్మి (హిమజ), హాఫ్ బాయిల్డ్ (శ్రీని వాస్ రెడ్డి), గౌరవ్ (వెన్నెల రామారావ్) ఎలాంటి సహాయం చేశారు? చాందిని, సోము ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే 10th class dairies సినిమా కథ.

    **Note:Hey! Would you like to share the story of the movie 10th క్లాస్ డైరీస్ with us? Please send it to us (popcorn@oneindia.co.in).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X