ఆకాశం నీ హద్దురా సినిమా బయోగ్రఫీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు,కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సూర్యనే నిర్మాత. సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ సౌజన్యంతో 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య ఈ సినిమాను నిర్మించారు. రాజశేఖర్ కర్పూరపాండియన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సూర్తి సహనిర్మాతలు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
కథ
చుండూరు లాంటి ఓ చిన్న గ్రామానికి చెందిన మహా అలియాస్ చంద్రమహేష్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. తన తండ్రి మాదిరిగానే సమాజం గురించే ఆలోచిస్తుంటాడు. వైమానిక దళంలో పనిచేసే మహాకు ఎప్పటికైనా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించి అతి సామాన్యుడికి కూడా విమానంలో ప్రయాణించాలనే కోరికను లక్ష్యంగా పెట్టుకొంటాడు. అయితే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి జీవిత ప్రయాణాంలో పరేష్ గోస్వామి (పరేశ్ రావెల్) నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు. సొంత విమాన సంస్థను ఏర్పాటు చేయాలనుకొన్న మహాకు రాజకీయ, అధికార వర్గాల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తన కలను నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో రాష్ట్రపతిని ఎలా కలిశాడు. తన కెరీర్‌లోను, లక్ష్య సాధనలో నాయుడు (మోహన్ బాబు) ఎలాంటి పాత్ర పోషించారు. తన జీవిత భాగస్వామి బేబీ (అపర్ణ బాల మురళి) ఎలాంటి పాత్రను పోషించారు. తన గ్రామానికి చెందిన వారు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే ఆకాశం నీ హద్దురా మూవీ.