అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ సందేశ్, హరిప్రియ,కాశీ, శ్రీనివస రెడ్డి, ఆలీ, అహుతి ప్రసాద్, వెన్నెల కిశోర్, ధన్ రాజ్, యనమదల విశ్వనాథ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోనేటి శ్రీను నిర్వహించారు మరియు నిర్మతా లక్ష్మణ్ కేదారి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శాకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చరు.
కథ
చిన్నప్పటినుంచీ తల్లితండ్రులు లేకపోవటంతో భామ్మ(శ్రీ లక్ష్మి) దగ్గరే పెరిగిన శ్రీ(వరుణ్ సందేశ్) కి పెంపక లోపంతో అమ్మాయిలు అంటే భయం. వారని చూస్తే పారిపోతూంటాడు. అలాంటి శ్రీకి అంజలి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్దితులు ఏర్పడతాయి. అప్పటివరకూ అమ్మాయిలకు దూరంగా ఉండే శ్రీ ...ఈ పెళ్లిలోపు తనకు అమ్మాయిలంటే ఉన్న భయం పోగొట్టుకోవాలి ఫిక్స్ అవుతాడు. అందుకోసం కొద్ది రోజులు ఒకమ్మాయితో గడపాలనుకుంటాడు. ఆ క్రమంలో నీరు(హరిప్రియ)ని కలుస్తాడు. ఆమె ఓ వేశ్య. కాంట్రాక్ట్ మీద కొన్ని రోజులు తన ఇంటికి తెచ్చుకుంటాడు. తర్వాత శ్రీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఏమిటా మార్పులు అనేది మిగతా కథ.