అధినాయకుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, లక్ష్మీరాయ్, సలోని, జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రదీప్‌రావత్, సుకన్య, రెహమాన్, కాశీ విశ్వనాథ్, మురళీశర్మ, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరుచూరి మురళి నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాని మాలిక్ స్వరాలు సమకుర్చారు.
కథ
కాంట్రాక్టు కిల్లర్ బాబి(బాలకృష్ణ)అనుకోని సిట్యువేషన్ లో తను అనాధ కాదు తనకో కుటుంబం ఉందనే విషయం తెలుసుకుంటాడు. అంతేకాదు తన తండ్రి రామకృష్ణ ప్రసాద్(బాలకృష్ణ మళ్లీ)ని చంపేయాటనికి తననే వినియోగిస్తున్నారని అర్దం చేసుకుంటాడు. అప్పుడు తన తండ్రిని చంపాలనుకున్న ప్యాక్షనిస్ట్ (ప్రదీప్ రావత్)నుంచి రక్షించుదామని బయిలుదేరతాడు. కానీ కొన్ని అపార్దాల వల్ల కొడుకుని దగ్గరకు రానివ్వడు ఆ తండ్రి. చివరకు బాబి.. తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు. తన తాత హరిశ్చంద్ర ప్రసాద్(ముసలి బాలకృష్ణ) ఆశయాలు తెలుసుకుని ఏం చేసాడు అన్నది మిగతా కథ.