అనుభవించు రాజా (2021)(U/A)
Release date
26 Nov 2021
genre
అనుభవించు రాజా స్టోరి
అనుభవించు రాజా సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, కాశీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆదుకలం నరేన్, అజయ్, ఆదర్శ్ బాలకృష్ణ, అరియనా గ్లోరీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను గోవిరెడ్డి వహించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సంగీతం గోపి సుందర్ అందించారు.
కథ
భీమవరంకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బంగార్రాజు ( రాజ్ తరుణ్) సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడు. ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొంటాడు. అయితే సంపాదన కోసమే జీవితమంతా కష్టపడ్డాం. సంపాదించిన మొత్తాన్ని అనుభవించకుండానే పోతున్నామని బంగార్రాజు తాత ఆవేదన చెందుతాడు. దాంతో తాతలు సంపాదించిన మొత్తాన్ని బంగార్రాజు అనుభవించాలని నిర్ణయించుకొంటాడు. అయితే జీవితంలో ఊహించని మలుపు తిప్పడంతో బంగార్రాజు హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేయాల్సి వస్తుంది. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాల్సిన బంగార్రాజు ఎందుకు జైలుకు వెళ్లాడు? జైలు నుంచి బయటకు వచ్చిన బంగార్రాజు సెక్యూరిటీ గార్డుగా ఎందుకు పనిచేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే శృతి (కశీష్ ఖాన్)తో బంగార్రాజుకు ఉన్న సంబంధం ఏమిటి? భీమవరంకు సమీపంలో ఉన్న గ్రామంలో జరిగిన గొడవలు బంగార్రాజు జీవితంపై ఎలా ప్రభావం చూపాయి? చివరికి తన గ్రామ ప్రజలను బంగార్రాజు ఏ విధంగా మెప్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే అనుభవించు రాజా సినిమా కథ
**Note:Hey! Would you like to share the story of the movie అనుభవించు రాజా with us? Please send it to us ([email protected]).