X
తెలుగు » సినిమాలు » అనుభవించు రాజా
అనుభవించు రాజా

అనుభవించు రాజా

Comedy | Romance | 26 Nov 2021 | U/A | 131 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అనుభవించు రాజా స్టోరీ

అనుభవించు రాజా సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, కాశీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆదుకలం నరేన్, అజయ్, ఆదర్శ్ బాలకృష్ణ, అరియనా గ్లోరీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను గోవిరెడ్డి వహించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సంగీతం గోపి సుందర్ అందించారు.  కథ  భీమవరంకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బంగార్రాజు ( రాజ్ తరుణ్) సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడు. ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొంటాడు. అయితే సంపాదన కోసమే జీవితమంతా కష్టపడ్డాం. సంపాదించిన మొత్తాన్ని అనుభవించకుండానే పోతున్నామని బంగార్రాజు తాత ఆవేదన చెందుతాడు. దాంతో తాతలు సంపాదించిన మొత్తాన్ని బంగార్రాజు అనుభవించాలని నిర్ణయించుకొంటాడు. అయితే జీవితంలో ఊహించని మలుపు తిప్పడంతో బంగార్రాజు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేయాల్సి వస్తుంది. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాల్సిన బంగార్రాజు ఎందుకు జైలుకు వెళ్లాడు? జైలు నుంచి బయటకు వచ్చిన బంగార్రాజు సెక్యూరిటీ గార్డుగా ఎందుకు పనిచేశాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే శృతి (కశీష్ ఖాన్‌)తో బంగార్రాజుకు ఉన్న సంబంధం ఏమిటి? భీమవరంకు సమీపంలో ఉన్న గ్రామంలో జరిగిన గొడవలు బంగార్రాజు జీవితంపై ఎలా ప్రభావం చూపాయి? చివరికి తన గ్రామ ప్రజలను బంగార్రాజు ఏ విధంగా మెప్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే అనుభవించు రాజా సినిమా కథ
Read More

అనుభవించు రాజా కాస్ట్ & క్రూ

అనుభవించు రాజా సిబ్బంది సమాచారం

దర్శకత్వం గావి రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత సుప్రియ యర్లగడ్డ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అనుభవించు రాజా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం లేకుండా తెరకెక్కించిన పక్కా రొటీన్, ఫార్మూలా మూవీ అనుభవించు రాజా. స్టోరి పాయింట్ బాగున్నప్పటికీ.. సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్‌ లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. పేలవమైన సన్నివేశాలు, రొటీన్ కథ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటాయి. సరైన హిట్టుకోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్.. మరికొన్నాళ్లు సక్సెస్ కోసం ఆగాల్సిందే అనే ఫీలింగ్ కలుగుతుంది. గ్రామీణ నేపథ్యంతో సాగే రివేంజ్ డ్రామాను థియేటర్లలో ఎంజాయ్ చేయాలనుకొని.. ఎలాంటి అంచనాలు లేకుండా కాస్త రిలాక్స్‌గా వెళితే.. అనుభవించు రాజాను కొన్ని అంశాలు మెప్పించేలా చేస్తాయి.

అనుభవించు రాజా ట్రైలర్

Video Thumbnail

అనుభవించు రాజా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అనుభవించు రాజా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+