బసంతి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గౌతమ్, అలీషాబేగ్, తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య దంతులురి మరియు నిర్మాత ఉమా నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
స్నేహితులతో సరదాగా స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు అర్జున్(గౌతమ్). అతను రోషిని (ఆలీషా)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమను వ్యక్తం చేసే సమయంలో ఆమె కనిపించకుండా పోతుంది. అదే సమయంలో అతను చదువుతున్న బసంతి ఇంజినీరింగ్ కాలేజీని టెర్రరిస్ట్ లు చుట్టుముట్టి ఆధీనంలోకి తీసుకుంటారు. స్టూడెంట్స్ ని విడుదల చేయాలంటే పోలీసుల అదుపులో ఉన్న టెర్రరిస్ట్ బాబాఖాన్ ని విడుదల చేయాలని కండీషన్ పెడతారు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో అర్జున్ క్లోజ్ ప్రెండ్ అబ్బాస్(రణధీర్)ని వాళ్లు చంపేస్తారు. దాంతో అర్జున్ ఎదురు తిరిగి ఏం చేసాడు..ఇంతకీ రోషిణి ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.