X
తెలుగు » సినిమాలు » భామా కలాపం
భామా కలాపం

భామా కలాపం

Crime | Thriller | 11 Feb 2022 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

భామా కలాపం స్టోరీ

భామా కలాపం సినిమా క్రైమ్, థ్రిల్ల‌ర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రియమణి, మీరా జాస్మిన్, జాన్ విజయ్, శరణ్య ప్రదీప్, పమ్మి సాయి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అభిమన్యు తడిమేటి వహించారు. నిర్మాతలు బాపినీడు బి, సుదీర్ ఈదర కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్ కలిసి అందించారు.  కథ అనుపమ(ప్రియమణి) మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. తన భర్త, కొడుకుతో కలిసి జీవించే ఆమె యూట్యూబ్ లో వంట వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే అనుపమకు ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే ఆసక్తి చాలా ఎక్కువ. అయితే ఈ అలవాటు కారణంగా అపార్ట్మెంట్ వాళ్ళతో, భర్తతో తిట్లు తింటూ ఉంటుంది. అయినా తన పద్ధతి మాత్రం మార్చుకోని ఆమె పక్కింటి భార్యాభర్తల గొడవ సంగతి తేల్చాలని భావించి అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆ హత్యకి అనుపమ కి ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసు వ‌లన అనుప‌మ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది..? అనేది సినిమా కథ. సాధారణ గృహిణి తనకున్న పక్కింటి మీద కన్ను వేసే అలవాటు కారణంగా ఒక హత్య కేసులో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? ఆ కష్టాల నుంచి బయట పడింది అనే దాన్ని సినిమాగా తెరకెక్కించారు. పక్కింటి భార్య భర్తల మధ్య జరిగిన గొడవ వెనుక రహస్యం ఛేదించాలనుకుని ఓ ఫ్లాట్ లోకి వెళ్ళి బుక్ అయిపోతుంది. ఆ ఫ్లాట్ లో నివాసముండే భర్త హత్యకు గురి కాగా, తనపై దాడి చేసిన మణి అనే వ్యక్తిని అనుపమ ఆత్మరక్షణ కోసం పొడిచి చంపేసి, తంటాలు పడి మణి శవాన్ని తన ఇంటికి తీసుకొచ్చి తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అతని శవం మాయం చేస్తే చాలనుకుని అనుకున్న టైమ్ లో నాయర్ (జాన్ విజయ్) అనే వ్యక్తి ఫోన్ చేసి... రెండు వందల కోట్ల విలువ చేసే కోడిగుడ్డు తనకు ఇవ్వకుంటే ఆమె శవాన్ని మాయం చేస్తున్న వీడియో బయట పెడతానని బెదిరిస్తాడు. అసలు ఆ రెండు వందల కోట్లు కోడి గుడ్డు వెనుక ఉన్న కథేంటి? తనకు తెలియకుండానే ఈ వివాదంలో చిక్కుకున్న అనుపమ అందులోంచి ఎలా బయట పడింది? ప్లాట్స్ లోని వారి కష్టాలు విని వారికి పరిష్కారం చెప్పే పాస్టర్ డేనియల్ బాబు (కంచరపాలెం కిషోర్) ఈ హత్యలో ఏమేరకు ఉంది? చివరికి ఏమైంది? అనేది 'భామా కలాపం' కథ.
Read More

భామా కలాపం కాస్ట్ & క్రూ

భామా కలాపం సిబ్బంది సమాచారం

దర్శకత్వం అభిమన్యు తడిమేటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జస్టిన్‌ ప్రభాకరన్‌, మార్క్ కె రాబిన్
నిర్మాత బాపినీడు, సుధీర్ ఈదర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భామా కలాపం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ పాత్రలో ప్రియమణి కరెక్ట్ గా సూట్ అయింది. ఇతరుల విషయాల పట్ల ఆసక్తి చూపించే మధ్యతరగతి మహిళగా ప్రియమణి బాగా నటించి ఆకట్టుకుంది. ఆమె పనిమనిషిగా శరణ్య ప్రదీప్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా శాంతి రావు కూడా తన పరిధి మేరకు ఆకట్టుకుంది. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డేనియల్ బాబు గా నటించిన కంచరపాలెం కిషోర్ పొలిమేర గురించి. ప్రభువు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, ఆ వచ్చే సంకేతం కోసం ఎదురు చూసే పాస్టర్ పాత్రలో జీవించాడు. అతని నటన కొన్ని సీన్లలో ఆశ్చర్య పరుస్తుంది. తమిళ నటుడు జాన్ విజయ్ కూడా చాలా ఈజ్ తో నటించారు.

భామా కలాపం ట్రైలర్

Video Thumbnail

భామా కలాపం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భామా కలాపం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+