బ్లేడు బాబ్జీ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, శియాలి భగత్, రుతిక, హర్ష వర్దన్, వేణు మాధవ్, బ్రహ్మానందం, శ్రీనివాస రెడ్డి, కృష్ణ భగవాన్, ధర్మవరపు, కొండవలస, హేమ, అపూర్వ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:దేవి ప్రసాద్ నిర్వహించారు మరియు నిర్మాత ముత్యాల సత్య కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.
కథ
కష్టపడి దొంగిలించి సంపాదించిన సొమ్మును ఓ చోట పాతి పెట్టి తర్వాత తీసుకుందామని వచ్చేసరికి అక్కడ ఓ పోలీస్ కమీషనర్ ఆఫీస్ వెలిస్తే...పరిస్ధితి ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ బ్లేడు బాబ్జీ(అల్లరి నరేష్) అనే చిల్లర దొంగకి ఎదురవుతుంది. అతనికి ఆ డబ్బు అత్యవసరం.దాంతో బాబ్జీ...ఎస్సై పోస్ట్ లో జాయిన్ కాబోయే మనోహర్ (శ్రీనివాస రెడ్డి) ని కిడ్నాప్ చేసి అతని ప్లేసులోకి వెళ్తాడు. ఎన్నో ప్లాన్స్ వేసి ఆ డబ్బుదాచిన బ్యాగులు బయిటకుతీస్తాడు. అయితే అందులో డబ్బు ఉండదు. అంతా షాక్.ఇంతకీ ఆ సొమ్ము ఏమయింది. చివరకు బాబ్జీ ఆ డబ్బుని తిరిగి ఎలా పట్టుకున్నాడనేది మిగతా సినిమా.