బూచమ్మ బూచోడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఇందులో శివజి, కైనాజ్ మోతీవాలా, బ్రహ్మనందం, పొసాని క్రిష్ణ మురళి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం: రేవన్ యాదు నిర్వహించారు, స్నేహ మీడియా అండ్ హేజస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై నిర్మాతలు: రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చారు.
కథ
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్(శివాజీ) కొత్తగా ఫాం హౌస్ కొనుక్కుని తన భార్య శ్రావణి(కైనాజ్ మోతీవాలా)తో కలిసి హాపీగా గడిపేందుకు అక్కడికి వెళతాడు. అక్కడ సంతోషంగా గడుపుతున్న వీరికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో రాత్రి పూట వింత శబ్దాలు వస్తూ వారిని భయానికి గురి చేస్తూ ఉంటాయి. ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునే వీరు తమకు తెలియకుండానే రాత్రి పూట ఒకరినొకరు కొట్టుకుంటారు.
కట్ చేస్తే ఇంట్లో ప్రభాకర్, శానోరిటా అనే రెండు దయ్యాలు ఉన్నట్లు వారికి తెలిసి పోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దయ్యాలను బయటకు పంపడం ఎవరి వల్లా కాదు. చివరకు ఆ ఇంట్లో నుండి వారు బయటకు వెళ్లాలని ట్రై చేసినా ఆ దయ్యాలు వారిని వెళ్లనివ్వవు. ఆగస్టు 15న జరిగే ఓ సంఘటన స్టోరీలో కీలకంగా మారుతుంది. మరి ఆగస్టు 15న ఏం జరిగింది. ఆ దయ్యాల నుండి కార్తీక్, శ్రావణి ఎలా తప్పించుకున్నారు? అనేది తర్వాతి స్టోరీ.