X
తెలుగు » సినిమాలు » బూచమ్మ బూచోడు
బూచమ్మ బూచోడు

బూచమ్మ బూచోడు

Romance | Thriller | 15 Sep 2014 | A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

బూచమ్మ బూచోడు స్టోరీ

బూచమ్మ బూచోడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ థ్రిల్లర్  చిత్రం ఇందులో శివజి, కైనాజ్ మోతీవాలా , బ్రహ్మనందం, పొసాని క్రిష్ణ మురళి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం: రేవన్‌ యాదు నిర్వహించారు, స్నేహ మీడియా అండ్‌ హేజస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై నిర్మాతలు: రమేష్‌ అన్నంరెడ్డి, ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్‌ చంద్ర స్వరాలు సమకుర్చారు. కథ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్(శివాజీ) కొత్తగా ఫాం హౌస్ కొనుక్కుని తన భార్య శ్రావణి(కైనాజ్ మోతీవాలా)తో కలిసి హాపీగా గడిపేందుకు అక్కడికి వెళతాడు. అక్కడ సంతోషంగా గడుపుతున్న వీరికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో రాత్రి పూట వింత శబ్దాలు వస్తూ వారిని భయానికి గురి చేస్తూ ఉంటాయి. ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునే వీరు తమకు తెలియకుండానే రాత్రి పూట ఒకరినొకరు కొట్టుకుంటారు.  కట్ చేస్తే ఇంట్లో ప్రభాకర్, శానోరిటా అనే రెండు దయ్యాలు ఉన్నట్లు వారికి తెలిసి పోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దయ్యాలను బయటకు పంపడం ఎవరి వల్లా కాదు. చివరకు ఆ ఇంట్లో నుండి వారు బయటకు వెళ్లాలని ట్రై చేసినా ఆ దయ్యాలు వారిని వెళ్లనివ్వవు. ఆగస్టు 15న జరిగే ఓ సంఘటన స్టోరీలో కీలకంగా మారుతుంది. మరి ఆగస్టు 15న ఏం జరిగింది. ఆ దయ్యాల నుండి కార్తీక్, శ్రావణి ఎలా తప్పించుకున్నారు? అనేది తర్వాతి స్టోరీ.
Read More

బూచమ్మ బూచోడు కాస్ట్ & క్రూ

బూచమ్మ బూచోడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రేవన్‌ యాదు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత రమేష్‌ అన్నంరెడ్డి, ప్రసాద్‌ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బూచమ్మ బూచోడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
శివాజీ, కైనాజ్ మోతీవాలా పెర్పార్మెన్స్ ఫర్వాలేదు. రొమాంటిక్ సీన్లలో కాస్త ఓకే అనిపించినా, హారర్ సీన్లలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. గ్లామర్ పరంగా కైనాజ్ మోతీవాలకు మంచి మార్కులే పడ్డాయి. బ్రహ్మానందం ఉన్నా...ఆయన్ను సరిగ్గా వాడుకోలేక పోవడంతో కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. జబర్దస్త్ టీం కామెడీ కాస్త నవ్విస్తుంది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలే ఏమీ లేవు. గుణశేఖర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన రేవన్ యాదులో అనుభవలేని కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమా కాన్సెప్టు బానే ఉన్నా.....దాన్ని పర్‌పెక్టుగా పండించడంలో విఫలం అయ్యాడు. హారర్ సన్నివేశాలు ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యాడు. కథనం కూడా ఆకట్టుకునే విధంగా లేదు. సాంకేతిక అంశాల పరంగా చూస్తే...శేఖర్ చంద్ర అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. వినయ్ మిశ్రా సినిమాటోగ్రఫీ అంత బ్యాడ్ కాకపోయినా హారర్ కథాంశానికి తగిన విధంగా లేదని చెప్పొచ్చు. ఇతర సాంకేతిక విభాగాలు కూడా సరైన పనితీరు కనబర్చలేదు. ఓవరాల్‌గా......‘బూచమ్మ బూచోడు' సినిమా ప్రేక్షకులు ఆకట్టుకోవడంలో విఫలం అయిందని చెప్పక తప్పదు.

బూచమ్మ బూచోడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బూచమ్మ బూచోడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+