X
బ్రో
Fantasy | 28 Jul 2023 | U | 134 Mins
Telugu

బ్రో స్టోరీ

బ్రో మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం పవన్ కళ్యాణ్సాయి ధరమ్ తేజ్, కెటికా శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చేంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సముద్రఖని వహిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. 

కథ
పీపుల్స్ టైక్స్‌టైల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధరమ్ తేజ్)కి చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు మీద పడుతాయి. దాంతో యవ్వనంలో చాదస్తం ఎక్కువైపోతుంది. ఇద్దరు చెల్లెల్లు (ప్రియా వారియర్, యువ లక్ష్మీ), తమ్ముడు , తల్లి (రోహిణి) బాధ్యతలను తానే మోస్తున్నాననే భ్రమలో ఉంటాడు. ప్రేయసి రమ్య (కేతిక శర్మ)కు టైమ్ ఇవ్వకుండా బిజీగా ఉంటాడు. ఈ క్రమంలో ఉద్యోగం పనిమీద వైజాగ్‌కు వెళ్లి వస్తూ కారు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. తన మరణం తర్వాత టైటాన్ అలియాస్ టైమ్ (పవన్ కల్యాణ్)ను కలుస్తాడు. తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉందని బాధపడుతుంటే.. 90 రోజులు బతికే అవకాశం ఇస్తాడు. 90 రోజుల మళ్లీ బతికే అవకాశం లభించడంతో మార్క్ ఏం చేశాడు? కుటుంబంలో తనపై తిరుగుబాటు రావడంతో ఎలా ఫీలయ్యాడు? ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన చెల్లెలు పరిస్థితి ఏమైంది. విదేశాల్లో చదువుకోవాలనుకొనే చెల్లెలికి పెళ్లి చేయాలనుకొన్న మార్క్‌కు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? తనకు తెలియకుండా రెండేళ్లుగా లవర్‌తో డేటింగ్ చేస్తున్న తమ్ముడి పరిస్థితిని చూసి మార్క్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అస్వస్థతకు గురైన తల్లి విషయంలో కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ప్రేయసి రమ్యను మార్క్ ఎందుకు? ఎలా దూరం చేసుకొన్నాడు? సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న మార్క్‌కు టైటాన్ ఎలాంటి గీతోపదేశం చేశాడు? 90 రోజులు పూర్తి కాకుండానే మార్క్ తన మరణాన్ని ఎందుకు కోరుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బ్రో ది అవతార్ సినిమా. 

రిలీజ్
ఈ చిత్రం 2023 జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది
 

ఎప్పుడు సమయానికి ఇంపార్టెన్స్‌ ఇవ్వని సాయిధరమ్‌ తేజ్‌కు టైమ్‌ విలువ తెలిసేలోపు గాల్లో కలిసి పోతాడు. అప్పటికి ఆయన చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అదే టైమ్‌లో పవన్‌ కళ్యాణ్ దేవుడిగా వచ్చి సాయిధరమ్‌కు ఓ వరం ఇస్తాడు. మరి ఆ వరాన్ని సాయి తేజ్‌ ఎలా వాడుకున్నాడు. అప్పటివరకు ఇంట్లో వాళ్లకి, ప్రెండ్స్‌కు టైమ్‌ ఇవ్వలేని హీరో.. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్లతో ఎలా టైమ్‌ స్పెండ్ చేశాడు. అతనింకా భూమిపై చేయాల్సిన పనులేమున్నాయి అనే కథనంతో సినిమా ముందుకు సాగుతున్నట్లు ట్రైలర్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
 
 
 
 
 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+