X
బ్రో

బ్రో

Fantasy | 28 Jul 2023 | U | 134 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

బ్రో స్టోరీ

బ్రో  మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం  పవన్ కళ్యాణ్ ,  సాయి ధరమ్ తేజ్ , కెటికా శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చేంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సముద్రఖని వహిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.  కథ పీపుల్స్ టైక్స్‌టైల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధరమ్ తేజ్)కి చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు మీద పడుతాయి. దాంతో యవ్వనంలో చాదస్తం ఎక్కువైపోతుంది. ఇద్దరు చెల్లెల్లు (ప్రియా వారియర్, యువ లక్ష్మీ), తమ్ముడు , తల్లి (రోహిణి) బాధ్యతలను తానే మోస్తున్నాననే భ్రమలో ఉంటాడు. ప్రేయసి రమ్య (కేతిక శర్మ)కు టైమ్ ఇవ్వకుండా బిజీగా ఉంటాడు. ఈ క్రమంలో ఉద్యోగం పనిమీద వైజాగ్‌కు వెళ్లి వస్తూ కారు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. తన మరణం తర్వాత టైటాన్ అలియాస్ టైమ్ (పవన్ కల్యాణ్)ను కలుస్తాడు. తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉందని బాధపడుతుంటే.. 90 రోజులు బతికే అవకాశం ఇస్తాడు. 90 రోజుల మళ్లీ బతికే అవకాశం లభించడంతో మార్క్ ఏం చేశాడు? కుటుంబంలో తనపై తిరుగుబాటు రావడంతో ఎలా ఫీలయ్యాడు? ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన చెల్లెలు పరిస్థితి ఏమైంది. విదేశాల్లో చదువుకోవాలనుకొనే చెల్లెలికి పెళ్లి చేయాలనుకొన్న మార్క్‌కు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? తనకు తెలియకుండా రెండేళ్లుగా లవర్‌తో డేటింగ్ చేస్తున్న తమ్ముడి పరిస్థితిని చూసి మార్క్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అస్వస్థతకు గురైన తల్లి విషయంలో కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ప్రేయసి రమ్యను మార్క్ ఎందుకు? ఎలా దూరం చేసుకొన్నాడు? సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న మార్క్‌కు టైటాన్ ఎలాంటి గీతోపదేశం చేశాడు? 90 రోజులు పూర్తి కాకుండానే మార్క్ తన మరణాన్ని ఎందుకు కోరుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బ్రో ది అవతార్ సినిమా.  రిలీజ్ ఈ చిత్రం 2023 జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది   బ్రో మూవీ డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి    ట్రైలర్‌ ఎప్పుడు సమయానికి ఇంపార్టెన్స్‌ ఇవ్వని సాయిధరమ్‌ తేజ్‌కు టైమ్‌ విలువ తెలిసేలోపు గాల్లో కలిసి పోతాడు. అప్పటికి ఆయన చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అదే టైమ్‌లో పవన్‌ కళ్యాణ్ దేవుడిగా వచ్చి సాయిధరమ్‌కు ఓ వరం ఇస్తాడు. మరి ఆ వరాన్ని సాయి తేజ్‌ ఎలా వాడుకున్నాడు. అప్పటివరకు ఇంట్లో వాళ్లకి, ప్రెండ్స్‌కు టైమ్‌ ఇవ్వలేని హీరో.. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్లతో ఎలా టైమ్‌ స్పెండ్ చేశాడు. అతనింకా భూమిపై చేయాల్సిన పనులేమున్నాయి అనే కథనంతో సినిమా ముందుకు సాగుతున్నట్లు ట్రైలర్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.   బ్రో ఆన్ సీన్ ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి       బ్రో మూవీ నటీనటులు- సాంకేతిక నిపుణుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి        
Read More

బ్రో కాస్ట్ & క్రూ

బ్రో సిబ్బంది సమాచారం

దర్శకత్వం సముద్రఖని
స్టోరీ సముద్రఖని
డైలాగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ సుజిత్ వాసుదేవ్
సంపాదకుడు నవీన్ నూలి
సంగీతం తమన్ యస్
నిర్మాత టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కుచిబోట్ల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్రో విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
వినోదయ సీతమ్ సినిమా కథలోని ఆత్మను తీసుకొని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసుకొని రూపొందించిన చిత్రం బ్రో ది అవతార్. సెకండాఫ్‌‌‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు బలంగా మారాయి. ఫస్టాఫ్‌లో స్లోగా రన్ కావడం, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ లేకపోవడం కొంత నిరాశ అని చెప్పవచ్చు. కానీ పవన్ వింటేజ్ గెటప్స్, పాటలు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌. పవన్ కల్యాణ్ మార్కు తరహా సినిమా కాదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెళితే.. మంచి అనుభూతి, జోష్ కలుగుతుంది. కేవలం ఫ్యాన్స్ కాకుండా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. ఓవరాల్‌గా మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ మూవీ. వన్ టైం వాచ్ మస్ట్.

బ్రో ట్రైలర్

Video Thumbnail

బ్రో పాటలు

Music Director: తమన్ యస్

బ్రో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బ్రో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+