CelebsbredcrumbBrahmanandam
  బ్రహ్మనందం

  బ్రహ్మనందం

  Actor/Actress
  Born : 01 Feb 1956
  కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. సినిమాల్లోకి రాక ముందు లెక్చరర్ గా పనిచేశారు. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించాడు. ఇతని భార్య లక్ష్మి. వీరికి... ReadMore
  Famous For
  కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. సినిమాల్లోకి రాక ముందు లెక్చరర్ గా పనిచేశారు. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించాడు. ఇతని భార్య లక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు(గౌతమ్, సిద్ధార్థ్).


  బ్రహ్మానందం వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నాడు. 2005 లో ఆచార్య నాగార్జున...
  Read More
  • 1
   హాస్య నటుడు బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మనందం. ఫిబ్రవరి 1వ తేది 1956లో సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో జన్మించాడు.
  • 2
   సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్‌లో విద్యార్ధిగా పాఠాలు నేర్చారు. అప్పట్లో స్వర అనుకరణలు (మిమిక్రీ), సాంస్కృతిక బృందాలలో చురుగ్గా పాల్గొనేవారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజిలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ పూర్తిచేశారు. తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నాడు.
  • 3
   అత్తిలిలో తొమ్మిదేళ్లపాటు అధ్యాపకుడిగా పనిచేసి సినిమా రంగంలో అడుగు పెట్టారు. నిజ జీవితంలో పలువురు వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందారు.
  • 4
   ఆయన మొదటి సినిమా జంద్యాల గారి'అహానా పెళ్లంటా' సినిమా తీయడానికి ముందు అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు.
  • 5
   అహానా పెళ్ళంట సినిమాతర్వాత బహ్మానందం కామెడీ రారాజుగా మారిపోయారు.
  • 6
   తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.దర్శకులు ఆయన కోసమే ప్రత్యేకించి పాత్రను రాసుకునేవారు. పాత్ర ఏదైనా బ్రహ్మనందం అందులో జీవించే వారు అనడంలోఅతిశయోకిత్తి లేదు.
  • 7
   అరగుండుగా.... ఖాన్‌దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్‌ఎంపీగా వైవిధ్య పాత్రల్లో మెప్పించిన నట మేరునగవు ఆయన. స్వల్పకాలంలోనే వివిధ భాషల్లో 1000కి పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డును సృష్టించారు.
  • 8
   1985లో దూరదర్శన్‌లో వచ్చిన పకపకలకు మంచి స్పందన వచ్చింది. తరాల వారీగా తరగని నవ్వులు పంచుతూ వస్తోన్న ఆయన, 'మనీ, అనగనగా ఒక రోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక సినిమాలు నటించి నందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు.
  • 9
   2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. తెలుగులొ 20వ శతాబ్దంలొ వచ్చిన సినిమాలన్నింటిలొ నటించారు.
  • 10
   ఇప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన హాస్యపు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కామెడీ ఘనాపాటి బ్రహ్మానందం. టాలీవుడ్‌లో ఈయన ఓ బ్రాండ్. తెర‌పై ఆయ‌న కాదు.. అత‌డి బ‌ట్ట‌త‌ల కనిపించినా చాలు హీరోకి ప‌డ్డ‌న్ని విజిల్స్ ప‌డ‌తాయి. గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి బ్ర‌హ్మి ప్ర‌స్థానం ఎదురులేకుండా సాగుతుంది. స్టార్ హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని క్రేజ్ తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాడు బ్ర‌హ్మానందం.
  • 11

   కేవ‌లం ఆయ‌న అప్పియ‌రెన్స్‌తోనే కొన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయంటే అతిశ‌యోక్తి కాదు. ఎక్కడో కాలేజ్ లెక్చరర్ కాస్తా ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి కమెడియన్‌గా మారి.. ఇప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్ కావడం అంటే చిన్న విషయం కాదు. చిరంజీవి పట్టుకొచ్చిన ఈ టాలెంట్.. ఇప్పుడు తెలుగు పరిశ్రమ నవ్వుకే చిరంజీవిలా మారిపోయింది. తెలుగు సినిమా కళామతల్లి పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వులా ఉండిపోయాడు బ్రహ్మి.
  • 12
   ఎన్నో వందల సినిమాల్లో తనదైన నటనతో మెప్పించాడు ఈయన. మొదట్లో చిన్న సినిమాలు చేసినా కూడా.. 1987లో జంధ్యాల తెరకెక్కించిన అహ నా పెళ్లంటలో ఈయన చేసిన అరగుండు పాత్ర అదిరిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు బ్రహ్మానందం. ఈ 35 ఏళ్ళ కెరీర్‌లో అరడజన్ నందులతో పాటు.. ఓ ఫిల్మ్ ఫేర్.. మూడు సైమా అవార్డులు సొంతం చేసుకున్నాడు ఈ లెజెండరీ కమెడియన్.
  • 13
   దర్శకులు చెప్పినా చెప్పకపోయినా సీన్ పండడానికి తనవంతుగా సొంతంగా కొన్ని ఊత పదాలు కూడా సృష్టించాడు ఈయన. అలా బ్రహ్మానందం నోట్లో నుంచి వచ్చిన జప్ఫా, నీ యంకమ్మా, పండగ చేస్కో డూ ఫెస్టివల్, ఖాన్‌తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయ్.. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లైతే.. ఇలా ఎన్నో మాటలు చిన్న పిల్లల నుంచి ముసలాళ్ల వరకు రోజూ వాడుకుంటారు.
  బ్రహ్మనందం వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X