క్రష్ సినిమా అడల్ట్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభయ్ సింహ, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పెర్రీ పాండే, శ్రీ సుధా రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం- నిర్మాత: రవిబాబు. సంగీతం వైద్ధే అందించారు.
కథ
పై చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ముగ్గురు కుర్రాళ్ళ కథ ఇది.. రవి (అభయ్ సింహా), వంశీ(కృష్ణ బూర్గులra), తేజు(చరణ్ సాయి) తమ కంటే సీనియర్ అయిన ఒకరు అమెరికా వెళ్లి సెలవులకు వస్తే ఆ సెలవుల్లో వచ్చి ఇచ్చిన ఒక ఐడియా వీరి జీవితాలను ఎలా మలుపు తిప్పింది అనేదే ఈ సినిమా కథ.. అమెరికా వెళ్లి వచ్చిన సదరు వ్యక్తి అమెరికాలో వర్జిన్ అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరని, ఒక వింత జంతువును చూసినట్లు చూస్తారు అని చెప్పడంతో పాటుగా ఎలా అయినా ఇక్కడే వర్జినిటీ కోల్పోయి అమెరికా రావాలని సలహా ఇస్తాడు. ఆ సలహా పాటిస్తూ ఈ ముగ్గురు వర్జినిటీ కోల్పోవడానికి ఎవరెవరితో ట్రైల్స్ వేశారు, ఆ ట్రైల్స్ ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి. అనేదే ఈ సినిమా కధ.