X
తెలుగు » సినిమాలు » ఎంతవరకు ఈ ప్రేమ
ఎంతవరకు ఈ ప్రేమ

ఎంతవరకు ఈ ప్రేమ

Romance | 07 Apr 2017 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఎంతవరకు ఈ ప్రేమ స్టోరీ

ఎంతవరకు ఈ ప్రేమ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జీవా, కాజల్ అగర్వాల్, బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునైన, సింహా, ఆర్ జె బాలాజి, మనోబాల, జోతి లక్ష్మి, మయిల్సామి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డీకే వహించారు మరియు నిర్మాత డి వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్ స్వారాలు సమకుర్చరు.   కథ అరవింద్(జీవా), దివ్య (కాజల్) ప్రేమించుకుంటారు. అయితే ఈ పెళ్లి దివ్య తల్లి(రాశి)కి ఇష్టం ఉండదు. దీంతో లేచిపోయి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కూడా పూర్తికాక ముందే ఓ చిన్న గొడవ కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఇంట్లో దివ్యకు ఫారిన్ నుండి వచ్చిన అర్జున్(బాబీ సింహా)తో పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. దివ్య కూడా అతడిని ఇష్టపడుతుంది. ఈ పెళ్లి జరుగాలంటే అరవింద్ నుండి విడాకులు కావాలి. విడాకుల పేపర్లపై సంతకం పెట్టించుకోవాలని దివ్య అరవింద్ వద్దకు వెలుతుంది. అయితే దివ్య అంటే ప్రేమ చావని అరవింద్ ... ఆమె తనకు దగ్గరయ్యేలా రకరకాల ప్లాన్స్ వేసి ఫెయిల్ అవుతాడు. ప్రేమించుకున్న ఇద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటి? అరవింద్ కు దవ్య దక్కిందా? అనేది తర్వాతి కథ. 
Read More

ఎంతవరకు ఈ ప్రేమ కాస్ట్ & క్రూ

ఎంతవరకు ఈ ప్రేమ సిబ్బంది సమాచారం

దర్శకత్వం డీకే
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం లియోన్ జేమ్స్
నిర్మాత డి వెంకటేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎంతవరకు ఈ ప్రేమ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తెలుగు ప్రేక్షకులకు జీవా గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉంటే అది ‘రంగం' మాత్రమే. ఆ సినిమా తర్వాత జీవా నటించి సినిమాలు తెలుగులో అనువాదమైనా అన్నీ ప్లాపే. ‘ఎంత వరకు ఈ ప్రేమ' సినిమాలో జీవా పెర్పార్మెన్స్ గురించి గొప్పగా చెప్పుకునే విషయాలేవీ లేవు. జస్ట్ యావరేజ్ అంతే. కాజల్ అందంగా కనిపించింది. పెర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే ఇంతకుముందు సినిమాల్లో కాజల్‌ను ఎలా చూసామో అలాంటి యాటిట్యూడ్, పెర్ఫార్మెన్స్ తో రోటీన్ గా కనిపిస్తుంది. హీరోయిన్ తల్లిగా రాశి కేవలం ఒకటి రెండు సీన్ కు పరిమితం అయింది. బాబీ సింహా, సునైనా తదతరులు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లోనే కనిపించారు. రొమాంటిక్ కామెడీ డ్రామా కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే సినిమా ఎక్కడా కూడా రొమాంటిక్ గా అనిపించదు. లవ్ ఫీలయ్యే సీన్లు కనీసం ఒక్కటి కూడా కనిపించవు. సినిమాలో కామెడీ ఉంది కానీ అది తెలుగు ప్రేక్షకులకు రుచించే స్థాయిలో మాత్రం లేదు. సినిమా ప్రారంభం నుండి మొదలు పెడితే పూర్తయ్యే వరకు స్లోగానే నడుస్తుంది. రెండు గంటల పాటు సినిమాను నడిపించడానికి కొన్ని సీన్లు కావాలని ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.

ఎంతవరకు ఈ ప్రేమ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు

×
2.5 /5 Your Rating

ఎంతవరకు ఈ ప్రేమ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+