ఎంతవరకు ఈ ప్రేమ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జీవా, కాజల్ అగర్వాల్, బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునైన, సింహా, ఆర్ జె బాలాజి, మనోబాల, జోతి లక్ష్మి, మయిల్సామి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డీకే వహించారు మరియు నిర్మాత డి వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్ స్వారాలు సమకుర్చరు.
కథ
అరవింద్(జీవా), దివ్య (కాజల్) ప్రేమించుకుంటారు. అయితే ఈ పెళ్లి దివ్య తల్లి(రాశి)కి ఇష్టం ఉండదు. దీంతో లేచిపోయి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కూడా పూర్తికాక ముందే ఓ చిన్న గొడవ కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఇంట్లో దివ్యకు ఫారిన్ నుండి వచ్చిన అర్జున్(బాబీ సింహా)తో పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. దివ్య కూడా అతడిని ఇష్టపడుతుంది. ఈ పెళ్లి జరుగాలంటే అరవింద్ నుండి విడాకులు కావాలి. విడాకుల పేపర్లపై సంతకం పెట్టించుకోవాలని దివ్య అరవింద్ వద్దకు వెలుతుంది. అయితే దివ్య అంటే ప్రేమ చావని అరవింద్ ... ఆమె తనకు దగ్గరయ్యేలా రకరకాల ప్లాన్స్ వేసి ఫెయిల్ అవుతాడు. ప్రేమించుకున్న ఇద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటి? అరవింద్ కు దవ్య దక్కిందా? అనేది తర్వాతి కథ.