»   » ‘ఎంత వరకు ఈ ప్రేమ’ (మూవీ రివ్యూ)

‘ఎంత వరకు ఈ ప్రేమ’ (మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

హైదరాబాద్: 'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన తమిళ రొమాంటిక్ కామెడి ఎంటర్టెనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' అనే పేరుతో రిలీజ్ చేసారు. డీకే దర్శకత్వం వహించిన ఈ తమిళంలో గతేడాది నవంబర్లనే 'కవలై వేండం' రిలీజైంది. అయితే కొన్ని కారణాలతో తెలుగులో అపుడు రిలీజ్ కాలేదు. డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ ఈ చిత్రాన్ని తెలుగులో ఇపుడు రిలీజ్ చేసారు.

కథ

కథ

అరవింద్(జీవా), దివ్య (కాజల్) ప్రేమించుకుంటారు. అయితే ఈ పెళ్లి దివ్య తల్లి(రాశి)కి ఇష్టం ఉండదు. దీంతో లేచిపోయి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కూడా పూర్తికాక ముందే ఓ చిన్న గొడవ కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఇంట్లో దివ్యకు ఫారిన్ నుండి వచ్చిన అర్జున్(బాబీ సింహా)తో పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. దివ్య కూడా అతడిని ఇష్టపడుతుంది. ఈ పెళ్లి జరుగాలంటే అరవింద్ నుండి విడాకులు కావాలి. విడాకుల పేపర్లపై సంతకం పెట్టించుకోవాలని దివ్య అరవింద్ వద్దకు వెలుతుంది. అయితే దివ్య అంటే ప్రేమ చావని అరవింద్ ... ఆమె తనకు దగ్గరయ్యేలా రకరకాల ప్లాన్స్ వేసి ఫెయిల్ అవుతాడు. ప్రేమించుకున్న ఇద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటి? అరవింద్ కు దవ్య దక్కిందా? అనేది తర్వాతి కథ.


పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

తెలుగు ప్రేక్షకులకు జీవా గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉంటే అది ‘రంగం' మాత్రమే. ఆ సినిమా తర్వాత జీవా నటించి సినిమాలు తెలుగులో అనువాదమైనా అన్నీ ప్లాపే. ‘ఎంత వరకు ఈ ప్రేమ' సినిమాలో జీవా పెర్పార్మెన్స్ గురించి గొప్పగా చెప్పుకునే విషయాలేవీ లేవు. జస్ట్ యావరేజ్ అంతే. కాజల్ అందంగా కనిపించింది. పెర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే ఇంతకుముందు సినిమాల్లో కాజల్‌ను ఎలా చూసామో అలాంటి యాటిట్యూడ్, పెర్ఫార్మెన్స్ తో రోటీన్ గా కనిపిస్తుంది. హీరోయిన్ తల్లిగా రాశి కేవలం ఒకటి రెండు సీన్ కు పరిమితం అయింది. బాబీ సింహా, సునైనా తదతరులు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లోనే కనిపించారు.


సినిమా ఎలా ఉందంటే

సినిమా ఎలా ఉందంటే

రొమాంటిక్ కామెడీ డ్రామా కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే సినిమా ఎక్కడా కూడా రొమాంటిక్ గా అనిపించదు. లవ్ ఫీలయ్యే సీన్లు కనీసం ఒక్కటి కూడా కనిపించవు. సినిమాలో కామెడీ ఉంది కానీ అది తెలుగు ప్రేక్షకులకు రుచించే స్థాయిలో మాత్రం లేదు. సినిమా ప్రారంభం నుండి మొదలు పెడితే పూర్తయ్యే వరకు స్లోగానే నడుస్తుంది. రెండు గంటల పాటు సినిమాను నడిపించడానికి కొన్ని సీన్లు కావాలని ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.


దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డీకే... కథ కూడా తానే రాసుకున్నాడు. కథలో కాదు కదా కనీసం టేకింగులో కూడా కొత్తదనం చూపించలేదు. మరి స్క్రీన్ ప్లే అయినా డిఫరెంటుగా ప్లాన్ చేసాడా? అంటే అదీ లేదు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. నాలుగు లవ్ సీన్లు, నాలుగు కామెడీ సీన్లు, ఐదు పాటలు ఉంటే చాలు సినిమా తీసినట్లే అనే మైండ్ సెట్ లో సినిమా తీసినట్లుంది.


సినిమాటోగ్రఫీ

సినిమాటోగ్రఫీ

సినిమాలో ప్రేక్షకలు కనెక్ట్ అయ్యే అంశం ఏదైనా ఉంది అంటే అది కేవలం సినిమాటోగ్రపీ మాత్రమే. తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ ప్రాంతంలో సినిమా చిత్రీకరించారు. అభినందన్ రామానుజన్ ఫోటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


ఎడిటింగ్, డైలాగ్స్

ఎడిటింగ్, డైలాగ్స్

ఈ సినిమాకు వెన్నెకల కంటి మాటలు అందించారు. గొప్పగా చెప్పుకునే డైలాగులు ఏమీ లేక పోయినా కొన్ని డైలాగులు ఫర్వాలేదు. అప్పటికి తమిళ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో చాలా సీన్లు తీసి రెండు గంటల్లోపే ముగించారు. అంతకు మించి ఎడిట్ చేస్తే సినిమా మరీ చిన్నగా ఉంటుందని వదిలేసారని స్పష్టమవుతుంది.


మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్

మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్

లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. పాటలు యావరేజ్ గా ఉన్నాయి. ఇక సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా ఓకే.


బలాలు

బలాలు

హీరో జీవా
హీరోయిన్ కాజల్
సినిమాటోగ్రఫీ


బలహీనతలు

బలహీనతలు

కథ, స్క్రీన్ ప్లే
డైరెక్షన్
మ్యూజిక్


ఫైనల్ వర్డ్...

ఫైనల్ వర్డ్...

‘ఎంతవరకు ఈ ప్రేమ' సినిమా చూసిన వారికి.... ఇంకెంత వరకు ఈ టార్చర్ అన్న ఫీలింగ్ కలుగుతుంది.


English summary
Actor Jiiva’s film Enthavaraku Ee Prema was supposed to be a new-age romantic comedy. Instead, it is a case study for how to make a regressive film in this genre and exposes the failure of its director to go beyond the obvious.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu