X
హ్యాపి వెడ్డింగ్
Romance | 28 Jul 2018 |
Telugu

హ్యాపి వెడ్డింగ్ స్టోరీ

హ్యాపి వెడ్డింగ్ సినిమా రొమాంటిక్, ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, మురళి శర్మ, నరేష్,  తులసి శివరామణి, పవిత్ర లోకేష్, అన్నపూర్ణ, ఇంద్రజ జంటగా ఇంకా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లక్ష్మణ్ కార్య వహించారు మరియు యువీ క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్థోంది. ఈ చిత్రానికి సంగీతం శక్తికాంత్ అందించారు. 

కథ

విజయ్, నిహారిక రిలేషన్ కారణంగా బ్రేకప్ అయింది? ఆనంద్‌తో పెళ్లి వరకు వచ్చిన అక్షర ఎందుకు వెనుకంజ వేసింది. ఆనంద్, విజయ్‌లో అక్షరకు నచ్చని విషయాలు ఏమిటి? చివరకు విజయ్‌ని పెళ్లి చేసుకొందా? లేదా ఆనంద్‌తో పెళ్లి జరిగిందా? నిహారిక పెళ్లికి ముందు కథలో తిరిగిన మలుపులు ఏమిటి అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే హ్యాపీ వెడ్డింగ్ చిత్ర కథ.

పెళ్లి సంబురాలలో ఉన్న ఫ్యామిలికి అక్షర యూటర్న్ తీసుకొందనే విషయాన్ని ఆనంద్ షాకివ్వడంతో కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లుంది. ఆనంద్, అక్షర నేటి యువతకు ఎంజాయ్ చేసే పబ్బులు, పార్టీల వ్యవహారంతో కథ చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. కథా ప్రవాహంలో మధ్యలో ఫీల్‌గుడ్ డైలాగ్స్ పేల్చుతూ ఇంటర్వెల్‌ వరకు ఓ మోస్తారుగా లాక్కొచ్చే ప్రయత్నంలా ఉంటుంది. కాకపోతే ఒక ఎమోషన్ ఎపిసోడ్స్‌తో ట్విస్ట్ ఇవ్వడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

ఇక రెండో భాగంలో నిహారిక పెళ్లి చేసుకోవాలా వద్దా అని తీసుకొనే నిర్ణయాన్ని బేస్ చేసుకొని సింగిల్ పాయింట్ ఎజెండాతో కథ నడుస్తుంది. రకరకాల ఎమోషన్ సీన్లతో ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ సన్నివేశాలు బలంగా లేకపోవడంతో రెండో భాగం కూడా ఏదో నడుస్తుందంటే నడుస్తున్నదనే విధంగా సాగుతుంది. మళ్లీ చివర్లో అద్భుతమైన ఎపిసోడ్స్ ప్రేక్షకులను కన్విన్స్ చేస్తూ సినిమాను ముగించడంతో ఒకే, ఫర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+