X
తెలుగు » సినిమాలు » హ్యాపి వెడ్డింగ్
హ్యాపి వెడ్డింగ్

హ్యాపి వెడ్డింగ్

Romance | 28 Jul 2018 |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

హ్యాపి వెడ్డింగ్ స్టోరీ

హ్యాపి వెడ్డింగ్ సినిమా రొమాంటిక్, ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, మురళి శర్మ, నరేష్,  తులసి శివరామణి, పవిత్ర లోకేష్, అన్నపూర్ణ, ఇంద్రజ  జంటగా ఇంకా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లక్ష్మణ్ కార్య వహించారు మరియు యువీ క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్థోంది. ఈ చిత్రానికి సంగీతం శక్తికాంత్ అందించారు.  కథ విజయ్, నిహారిక రిలేషన్ కారణంగా బ్రేకప్ అయింది? ఆనంద్‌తో పెళ్లి వరకు వచ్చిన అక్షర ఎందుకు వెనుకంజ వేసింది. ఆనంద్, విజయ్‌లో అక్షరకు నచ్చని విషయాలు ఏమిటి? చివరకు విజయ్‌ని పెళ్లి చేసుకొందా? లేదా ఆనంద్‌తో పెళ్లి జరిగిందా? నిహారిక పెళ్లికి ముందు కథలో తిరిగిన మలుపులు ఏమిటి అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే హ్యాపీ వెడ్డింగ్ చిత్ర కథ. పెళ్లి సంబురాలలో ఉన్న ఫ్యామిలికి అక్షర యూటర్న్ తీసుకొందనే విషయాన్ని ఆనంద్ షాకివ్వడంతో కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లుంది. ఆనంద్, అక్షర నేటి యువతకు ఎంజాయ్ చేసే పబ్బులు, పార్టీల వ్యవహారంతో కథ చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. కథా ప్రవాహంలో మధ్యలో ఫీల్‌గుడ్ డైలాగ్స్ పేల్చుతూ ఇంటర్వెల్‌ వరకు ఓ మోస్తారుగా లాక్కొచ్చే ప్రయత్నంలా ఉంటుంది. కాకపోతే ఒక ఎమోషన్ ఎపిసోడ్స్‌తో ట్విస్ట్ ఇవ్వడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక రెండో భాగంలో నిహారిక పెళ్లి చేసుకోవాలా వద్దా అని తీసుకొనే నిర్ణయాన్ని బేస్ చేసుకొని సింగిల్ పాయింట్ ఎజెండాతో కథ నడుస్తుంది. రకరకాల ఎమోషన్ సీన్లతో ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ సన్నివేశాలు బలంగా లేకపోవడంతో రెండో భాగం కూడా ఏదో నడుస్తుందంటే నడుస్తున్నదనే విధంగా సాగుతుంది. మళ్లీ చివర్లో అద్భుతమైన ఎపిసోడ్స్ ప్రేక్షకులను కన్విన్స్ చేస్తూ సినిమాను ముగించడంతో ఒకే, ఫర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది.
Read More

హ్యాపి వెడ్డింగ్ కాస్ట్ & క్రూ

హ్యాపి వెడ్డింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం లక్ష్మణ్ కార్య
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శక్తికాంత్ కార్తీక్, తమన్ యస్
నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హ్యాపి వెడ్డింగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రేమ, బ్రేక్, పెళ్లి అనే మూడు అంశాలను కలబోసి సెన్సిటివ్‌గా కథను రాసుకోవడం ఓ ఛాలెంజ్ లాంటిందే. కాస్త తేడా కొట్టినా టోటల్‌గా మిస్ ఫైర్ అవుతాయి. కాకపోతే తొలి చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య తన ప్రతిభను పూర్తి స్థాయిలో చూపించలేకపోయినా.. ప్రేక్షకులు మెప్పించే ప్రయత్నం చేయడం ఆయన డైరెక్షన్‌లో పాజిటివ్ అంశం. రొటీన్‌గా కాకుండా కొన్ని ఫీల్‌గుడ్ సన్నివేశాలను రాసుకొని ఉంటే మ్యారేజ్ జోనర్‌లో మంచి సినిమా అయ్యేది. ఓవరాల్‌గా వీకెండ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా కాలక్షేపం కోసం కాస్త హ్యూమర్, క్లీన్ సినిమా చూడాలంటే హ్యాపీ వెడ్డింగ్ చూడవచ్చు.

హ్యాపి వెడ్డింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • HELLO, TODAY I SAW THE MOVIE. I WAS VERY MUCH IMPRESSED ABOUT THE SCRIPT AND CAST OF THE MOVIE...THIS IS ONE OF MY FAVOURITE MOVIE....... I LIKE RELASTIC WAY OF NARRATING THE MOVIE.......... THIS MOVIE HAS NO VALGUR SCENCES...... EVERYONE SHO..

×
2.6 /5 Your Rating

హ్యాపి వెడ్డింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+