హుషారు (2018)
Release date
14 Dec 2018
genre
హుషారు స్టోరి
హుషారు సినిమా కామెడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తేజుస్, తేజ్ కురపాటి, దాక్ష, ప్రియ వడ్లమాని,రమ్య పసుపులేటి, అభినవ్ మెదిశెట్టి, తేజ్ కురపాటి, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ హర్ష కొనుగంటి వహించారు మరియు బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. వరికుప్పల యాదగిరి సంగీతమందించారు.
హుషారు కథ
ఆర్య (తేజస్ కంచెర్ల), చైతన్య అలియాస్ చై (అభినవ్ మేడిశెట్టి), బంటి (తేజ్ కూరపాటి), ధ్రువ్ (దినేష్ తేజ్) చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్. చదువు కంటే ఎంజాయ్మెంట్కే ప్రాధాన్యం ఇస్తూ జల్సాగా జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా బీరు తాగుతూ లైఫ్ లీడ్ చేయడం, ఫ్రెండ్షిప్ కోసమే బతికేస్తుంటారు. ఆర్య తన స్కూల్ మేట్ (దీక్ష నగార్కర్)తో ప్రేమలో పడుతాడు. పార్టీలో తొలిచూపులోనే ప్రేమించిన రియా (ప్రియా వడ్లమాని)కు చై దగ్గరవుతాడు. జీవితంలో సాఫీ సాగిపోతున్న సమయంలో ఓ కారణంగా చైతన్యను రియా వదిలేసి యూఎస్ వెళ్లిపోతుంది. దాంతో మానసికంగా కుంగిపోయిన చైతన్యకు క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. ఆర్యకు ప్రేమలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆర్థికంగా అవసరాలు పెరిగిపోవడంతో ఆదాయం కోసం బీరు తయారీని ఎంచుకొంటారు.
చైతన్యను రియా ఎందుకు వదిలేసింది? చైతన్య క్యాన్సర్ ట్రిట్మెంట్కు కావాల్సిన రూ.30 లక్షలు ఎలా సమకూర్చుకొన్నారు? ఈ కథలో రాహుల్ రామకృష్ణ ( రాజు బొల్లం) పాత్ర ఏంటి? ఈ నలుగురు స్నేహితులకు రాజు బొల్లంకు సంబంధమేమిటి? చివరకు నలుగురు స్నేహితులు జీవితం ఏ దిశగా ప్రయాణించింది. నలుగురు స్నేహితులు సమాజంలో ఎలాంటి గౌరవాన్ని దక్కించుకొన్నారు. ఆర్య ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే హుషారు సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie హుషారు with us? Please send it to us ([email protected]).