ఇష్క్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, నిత్యా మీనన్, అజయ్, నాగినీడు, సుధ, కాశీ విశ్వనాధ్, తాగుబోతు రమేష్, ఆలీ, సత్య్ కృష్ణా, సిందు తులానీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ విక్రమ్ గౌడ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ,నవ్విస్తూ తిరిగే రాహుల్(నితిన్)కి ప్లైట్ ప్రయాణంలో ప్రియ(నిత్య మీనన్)పరిచయమవుతుంది. అక్కడనుంచి అనుకోని పరిస్ధితుల్లో ప్లైట్ గోవాలో ల్యాండ్ అయ్యి వీరి పరచయాన్ని ప్రేమగా మార్చేస్తుంది. ఇద్దరూ అలా ప్రేమలో మునిగి తేలుతుండగా ప్రియ అన్న సూర్య(అజయ్)ద్వారా ట్విస్ట్ పడుతుంది. సూర్య గతంలో రాహుల్ అక్క(సింధు మీనన్)ని ప్రేమించమని టార్చర్ పెట్టి.. రాహుల్ చేతిలో దెబ్బ తిని ఉంటాడు. ఆ దెబ్బ మనస్సులో పెట్టుకున్న వీరి ప్రేమ కథను ఏమి మలుపు తిప్పుతాడు..ఎలా రాహుల్, ప్రియలు ఒకటయ్యారు అనేది మిగతా కథ.