X
ఇష్క్
Romance | Thriller | 30 Jul 2021 | U/A | 115 Mins
Telugu

ఇష్క్ స్టోరీ

ఇష్క్ సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తేజా సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజు వహించారు. ఎన్ వి ప్రసాద్, పరస్ జైన్ కలిసి నిర్మించారు. సాగర్ మహతి సంగీతం అందించారు. 

కథ 

సిద్ధార్థ్ (తేజ సజ్జా) అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనసూయ (ప్రియా ప్రకాష్ వారియర్) అనే ఒక స్టూడెంట్ ప్రేమలో ఉంటారు. అనసూయ పుట్టినరోజు సందర్భంగా నైట్ అవుట్ చేయాలని భావించి దానిని ఒక మెమొరబుల్ నైట్ గా మార్చాలి అనుకున్న ఈ జంటకు అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. మాధవ్(రవీంద్ర విజయ్)ఎంట్రీతో వీరి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. సిద్ధార్థ్, అనసూయ, మాధవ్ మధ్య ఏం జరిగింది అనేది సినిమా కథ. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఇష్క్ సినిమాను అదే పేరుతో అధికారికంగా తెలుగులో రీమేక్ చేశారు. అయితే సినిమా మొత్తం సస్పెన్స్ తో నింపే ప్రయత్నం చేశారు. నిజానికి ఒరిజినల్ సినిమా కాస్త లాగ్ అనిపిస్తుంది కానీ ఈ సినిమాని దానికంటే ఆసక్తికరంగా తీర్చిదిద్దాలని ట్రై చేశారు. మెమరబుల్ నైట్ ని హారిబుల్ నైట్ గా మార్చిన మాధవ్ కి సిద్ధార్థ్ ఎలా గుణపాఠం నేర్పాడు ? అలాగే సిద్ధార్థ - అనసూయ మధ్య క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఇలా చెప్పుకుంటే ఒకటి కాదు దాదాపు సినిమా అంతా ట్విస్టుల మయంగా మారింది. అయితే సస్పెన్స్ క్యారీ చేయడంలో పూర్తి సఫలమయ్యారని చెప్పలేం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+