ఇజం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి కళ్యాణ్‌రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్, శ్రీకాంత్, కోటేష్ మాధవ, నయన్(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబెన్స్ స్వరాలు సమకుర్చరు.
కథ
బ్యాంకాక్ లోని ఓ దీవిలో ఇల్లీగల్ స్ట్రీట్ ఫైట్స్ చేస్తూంటాడు కళ్యాణ్ రామ్(కళ్యాణ్ రామ్) . అక్కడికి వచ్చిన అలియా ఖాన్ (అదితి ఆర్య)ని చూసి లవ్ ఫస్ట్ సైట్ అంటూ ఆమె వెనకపడతాడు. ఆమె..మాఫియాసామ్రాజ్యాన్ని ఏలుతున్న జావేద్ ఇబ్రహీం (జగపతిబాబు) కూతురు. అదేంటి ప్రపంచాన్ని ఏలుతున్న అంత పెద్ద మాఫియా డాన్ కుమార్తె మన హీరో ( ఓ మామూలు పైటర్ కు) అంత ఈజీగా పరిచయం అవుతుందా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె వెనక పడటానికి బయిట దొరుకుతుందా అంటే...ఆమె అంతే... సెక్యూరిటీ గట్రా లేకుండా తిరుగుతూంటుంది. అంతెందుకు ఆ మాఫియా డాన్ ని కలవటమే చాలా చాలా ఈజీ. ఆయనకు కరీం బీడీకట్టలంటే ఉన్న బలహీనతతో ఆయన్ని కొడతాడు. భలే ఐడియా కదా. అంతేనా హీరోయిన్ కు పెళ్లి చూపులు అనగానే ఆ ఇంట్లోకి ఈజిగా జొరపడిబోతాడు. ఆ టైమ్ లో ఆ డాన్ గారు సెక్యూరిటీ నిద్రపోతోందా. ఇంతోటి డాన్ ని రా ఏజెంట్స్ కూడా ఏమీ చేయలేదు. ఆయన ఇంటికి కూడా వెల్లలేరు. ఈ లోగా హీరోయిన్ కు తను ప్రేమించే కల్యాణ్‌రామ్ అనేది అసలు పేరు కాదని, అతని పేరు సత్య మార్తాండ్ అని ఆమెకు తెలుస్తుంది. పోనీలే పేరులో ఏముంది పెన్నిది అని సరిపెట్టుకుందామనుకున్నా....అతనే తన తండ్రి పాలిటి విలన్ అని.. తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్ అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సత్యమార్తాండ్ ఎవరు? తను అలియా ప్రేమని అడ్డు పెట్టుకొని ఏం సాధించాలనుకొన్నాడు? జర్నలిజం గొప్పతనాన్ని సత్య ఎలా చాటి చెప్పాడు? అనే విషయాలు మీకు తెలుసుకోవాలంటే... వెండితెర మీద చూడాల్సిందే. అంతగా మీరు వెండితెరదాకా వెళ్లలేం అనుకుంటే మీకో క్లూ..ఆ జావేద్ ఇబ్రహం గారికి ఓ ప్యారడైజ్ బ్యాంక్ అని ఉంటుంది. దాంట్లో ఆయన మన పొలిటీషన్స్ అందరి నల్లధనం దాగుటుంది. మిగతాదంతా సస్పెన్స్..మీరే చూడండి.