X
ఇజం

ఇజం

Action | Romance | 21 Oct 2016 | U/A | 132 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఇజం స్టోరీ

ఇజం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌ , కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ నిర్వహించారు మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబెన్స్ స్వరాలు సమకుర్చరు.    కథ బ్యాంకాక్ లోని ఓ దీవిలో ఇల్లీగల్ స్ట్రీట్ ఫైట్స్ చేస్తూంటాడు కళ్యాణ్ రామ్(కళ్యాణ్ రామ్) . అక్కడికి వచ్చిన అలియా ఖాన్ (అదితి ఆర్య)ని చూసి లవ్ ఫస్ట్ సైట్ అంటూ ఆమె వెనకపడతాడు. ఆమె..మాఫియాసామ్రాజ్యాన్ని ఏలుతున్న జావేద్‌ ఇబ్రహీం (జగపతిబాబు) కూతురు. అదేంటి ప్రపంచాన్ని ఏలుతున్న అంత పెద్ద మాఫియా డాన్ కుమార్తె మన హీరో ( ఓ మామూలు పైటర్ కు) అంత ఈజీగా పరిచయం అవుతుందా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె వెనక పడటానికి బయిట దొరుకుతుందా అంటే...ఆమె అంతే... సెక్యూరిటీ గట్రా లేకుండా తిరుగుతూంటుంది. అంతెందుకు ఆ మాఫియా డాన్ ని కలవటమే చాలా చాలా ఈజీ. ఆయనకు కరీం బీడీకట్టలంటే ఉన్న బలహీనతతో ఆయన్ని కొడతాడు. భలే ఐడియా కదా. అంతేనా హీరోయిన్ కు పెళ్లి చూపులు అనగానే ఆ ఇంట్లోకి ఈజిగా జొరపడిబోతాడు. ఆ టైమ్ లో ఆ డాన్ గారు సెక్యూరిటీ నిద్రపోతోందా. ఇంతోటి డాన్ ని రా ఏజెంట్స్ కూడా ఏమీ చేయలేదు. ఆయన ఇంటికి కూడా వెల్లలేరు. ఈ లోగా హీరోయిన్ కు తను ప్రేమించే కల్యాణ్‌రామ్‌ అనేది అసలు పేరు కాదని, అతని పేరు సత్య మార్తాండ్‌ అని ఆమెకు తెలుస్తుంది. పోనీలే పేరులో ఏముంది పెన్నిది అని సరిపెట్టుకుందామనుకున్నా....అతనే తన తండ్రి పాలిటి విలన్ అని.. తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్‌ అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సత్యమార్తాండ్‌ ఎవరు? తను అలియా ప్రేమని అడ్డు పెట్టుకొని ఏం సాధించాలనుకొన్నాడు? జర్నలిజం గొప్పతనాన్ని సత్య ఎలా చాటి చెప్పాడు? అనే విషయాలు మీకు తెలుసుకోవాలంటే... వెండితెర మీద చూడాల్సిందే. అంతగా మీరు వెండితెరదాకా వెళ్లలేం అనుకుంటే మీకో క్లూ..ఆ జావేద్ ఇబ్రహం గారికి ఓ ప్యారడైజ్ బ్యాంక్ అని ఉంటుంది. దాంట్లో ఆయన మన పొలిటీషన్స్ అందరి నల్లధనం దాగుటుంది. మిగతాదంతా సస్పెన్స్..మీరే చూడండి.  
Read More

ఇజం కాస్ట్ & క్రూ

ఇజం సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత కళ్యాణ్ రామ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇజం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నల్లధనం వంటి సీరియస్ సబ్జెక్టుని ఓ కాకమ్మ కథలా అల్లిబిల్లిగా అల్లేసి మన ముందుంచే ప్రయత్నం చేసారు పూరి. ఈ కథలో హీరో తెహల్కా వంటి వెబ్సైట్ నడుతూ స్కామ్ లు అన్నీ లీక్ చేస్తూండాడు. అంతపెద్ద స్కామ్ లు లీక్ చేసినా ఎక్కడా అతనికి ఎదురనేది ఉండదు. ఇంటిలిజెన్స్ వారు కూడా పట్టుకోలేని...దావూద్ ఇబ్రహం స్దాయి మాఫియా డాన్ ని కలవటం, అతని ఇంటికి వెల్లటం వంటివి చాలా ఈజీగా చేసేస్తూంటాడు. దాంతో హీరో క్యారక్టరైజేషన్ ప్యాసివ్ గా మారి బోర్ కొట్టేసింది. ఇందులో జగపతిబాబు క్యారక్టరైజేషన్ చూస్తూంటే నవ్వు వస్తుంది. ఓ టోపి పెట్టుకుని, బీడి కాల్చుకుంటూ ఉంటాడు. ఎక్కడా కరుకుతనం అనేది ఉండదు. అతను విలన్ ముసుగులో ఉన్న మంచివాడేమో అనే డౌట్ వస్తూంటుంది. సినిమా సగం అయ్యేసరికి విలన్ జగపతి బాబు నా లేక పోసానా లేక, మన పొలిటీషన్స్ అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మాఫియా డాన్ కు వ్యతిరేకంగా చేస్తున్ననంటూ అతను బ్లాక్ మనీ ని బయిటకు తెచ్చే పనిలో ఉంటాడు. హీరో లక్ష్యం..బ్లాక్ మనీ బయిటకు తేవటమా లేక మాఫియా డాన్ ని అంతమొందించటమా తేలదు. దాంతో కథ ఎవరిని ఫాలో అవ్వాలో తెలియని స్దితి ఏర్పడింది. విలన్ ని మచ్చిక చేసుకోవటానికి అతని బలహీనత అయిన కరీం బీడి కట్టని అతని ఎదురుగా కాల్చి, అతనితో ప్రెండ్షిప్ చెయ్యవలను అనే కొత్త విషయం మనకు ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఏదో అల్లరి నరేష్ సినిమాలో సీన్ లాగ ఉంటుంది కానీ ఎక్కడా సీరియస్ గా అనిపించదు.

ఇజం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఇజం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+