X
తెలుగు » సినిమాలు » జయమ్మ పంచాయతీ
జయమ్మ పంచాయతీ

జయమ్మ పంచాయతీ

Drama | 06 May 2022 | U/A | 125 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

జయమ్మ పంచాయతీ స్టోరీ

జయమ్మ పంచాయతీ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమాకనకల తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ కుమార్ కలివరపు వహించారు. నిర్మాత బలగ ప్రకాష్ రావు నిర్మించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.   కథ శ్రీకాకుళం జిల్లా పాలకొండ దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో తన భర్త(దర్శకుడు దేవి ప్రసాద్), ఇద్దరు ఆడపిల్లలతో ప్రశాంతమైన జీవితం సాగిస్తూ ఉంటుంది జయమ్మ. భర్త మంచితనంతో ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని కౌలుకి పొలం చేస్తూ ఉన్నంతలో తృప్తిగానే బతుకుతూ ఉంటుంది. ఊరిలో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించే జయమ్మ అంటే ఊరు అందరూ కూడా భయపడుతూ ఉంటారు. తన పెద్ద కుమార్తె పుష్పవతి అయిన సమయంలో భర్తకు గుండె జబ్బు ఉన్న సంగతి తెలుసుకుంటుంది. అయితే కుమార్తె పుష్పవతి ఫంక్షన్ రోజున తమ ప్రాంతంలో ఎంతో కాలంగా వస్తున్న చదివింపులు కార్యక్రమంతో వచ్చిన డబ్బుతో భర్త గుండె ఆపరేషన్ చేయించుకోవచ్చు అనుకుంటుంది. అయితే అనుకున్నంత డబ్బు రాక పోవడంతో భర్తను కాపాడుకోవడం కోసం ఏం చేసింది? గుండె జబ్బుతో బాధ పడుతున్న జయమ్మ భర్త బతికాడా? భర్తను బతికించుకోవడం కోసం జయమ్మ పెట్టిన పంచాయితీ ఏమైంది అనేదే ఈ సినిమా కథ.
Read More

జయమ్మ పంచాయతీ కాస్ట్ & క్రూ

జయమ్మ పంచాయతీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజయ్ కుమార్ కలివరపు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత బెలగ ప్రకాష్ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జయమ్మ పంచాయతీ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
యాంకర్ సుమ మొదటి సారి చేసిన పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. యాంకర్ సుమ మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాకుళం యాస లో అక్కడక్కడ దొర్లే కొన్ని బూతు పదాలు(వారు వాటిని బూతులు అని కూడా అనుకోరు) తప్ప మిగతా ఎక్కడా కూడా అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. యాంకర్ సుమలో ఇంత మంచి నటి కూడా ఉందా అని తెలిసేలా చేసిన ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్.

జయమ్మ పంచాయతీ ట్రైలర్

Video Thumbnail

జయమ్మ పంచాయతీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జయమ్మ పంచాయతీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+