జెండాపై కపిరాజు సినిమా ప్రతి వ్యక్తి తనను తాను సమస్కరించుకుంటే, దేశాన్ని సమస్కరించినట్టే అనే కాన్సేప్ట్ తో వినీదభరితమైన చిత్రం ఇందులో నాని, అమలాపాల్, రాగిణి హీరోహీరోయిన్లుగా శరత్ కుమార్, శివ బాలాజి, వెన్నెల కిశోర్, ధన్ రాజ్, అహుతి ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి సముద్రఖని నిర్వహించారు, మల్టి డైమెన్షన్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కె ఎస్ శ్రీనివాసన్, కె ఎస్ శివరామన్, రజిత్ పార్థసారధి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతదర్శకుడు జి వి ప్రకాష్ స్వరాలు సమకుర్చారు.
కథ
అరవింద్(నాని) ఐటి ప్రొఫెషనల్. నీతిగా, న్యాయంగా ఉంటూ రూల్స్ ప్రకారం నడుచుకునే వ్యక్తి. తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న అవినీతి, లంచగొండి తనం అతన్ని అవినీతి వ్యతిరేక పోరాటం దిశగా నడిపిస్తుంది. ఈ క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని నీతివంతులైన అధికారులను ఏకం చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుడతారు. 147 మంది ప్రభుత్వ అధికారుల అవినీతిని సాక్షాధారాలతో సహా నిరూపించి మీడియా ద్వారా బట్టయబలు చేస్తారు. కేసు కోర్టుకు వెలుతుంది. అయితే 147 మంది అవినీతి అధికారులు ఒక కమిటీగా ఏర్పడి తమపై ఉన్న కేసును నీరుగార్చేందుకు.... మాయా కన్నన్(మరొక పాత్ర పోషించిన నాని)ను రంగంలోకి దింపుతారు. ఈ పోరాటంలో అరవింద్ ఎలా విజయం సాధించాడు అనేది తర్వాతి థియేటర్లో చూడాల్సిందే.