X
తెలుగు » సినిమాలు » జెండాపై కపిరాజు
జెండాపై కపిరాజు

జెండాపై కపిరాజు

Action | Romance | 21 Mar 2015 | U/A |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

జెండాపై కపిరాజు స్టోరీ

జెండాపై కపిరాజు సినిమా ప్రతి వ్యక్తి తనను తాను సమస్కరించుకుంటే, దేశాన్ని సమస్కరించినట్టే అనే కాన్సేప్ట్ తో వినీదభరితమైన చిత్రం ఇందులో నాని, అమలాపాల్, రాగిణి హీరోహీరోయిన్లుగా శరత్ కుమార్, శివ బాలాజి, వెన్నెల కిశోర్, ధన్ రాజ్, అహుతి ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి సముద్రఖని నిర్వహించారు, మల్టి డైమెన్షన్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కె ఎస్ శ్రీనివాసన్, కె ఎస్ శివరామన్, రజిత్ పార్థసారధి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతదర్శకుడు జి వి ప్రకాష్ స్వరాలు సమకుర్చారు. కథ అరవింద్(నాని) ఐటి ప్రొఫెషనల్. నీతిగా, న్యాయంగా ఉంటూ రూల్స్ ప్రకారం నడుచుకునే వ్యక్తి. తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న అవినీతి, లంచగొండి తనం అతన్ని అవినీతి వ్యతిరేక పోరాటం దిశగా నడిపిస్తుంది. ఈ క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని నీతివంతులైన అధికారులను ఏకం చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుడతారు. 147 మంది ప్రభుత్వ అధికారుల అవినీతిని సాక్షాధారాలతో సహా నిరూపించి మీడియా ద్వారా బట్టయబలు చేస్తారు. కేసు కోర్టుకు వెలుతుంది. అయితే 147 మంది అవినీతి అధికారులు ఒక కమిటీగా ఏర్పడి తమపై ఉన్న కేసును నీరుగార్చేందుకు.... మాయా కన్నన్(మరొక పాత్ర పోషించిన నాని)ను రంగంలోకి దింపుతారు. ఈ పోరాటంలో అరవింద్ ఎలా విజయం సాధించాడు అనేది తర్వాతి థియేటర్లో చూడాల్సిందే.
Read More

జెండాపై కపిరాజు కాస్ట్ & క్రూ

జెండాపై కపిరాజు సిబ్బంది సమాచారం

దర్శకత్వం పి సముద్రఖని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జి వి ప్రకాష్ కుమార్
నిర్మాత కె ఎస్ శ్రీనివాసన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జెండాపై కపిరాజు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దర్శకుడు సముద్రఖని ఎంచుకోవడమే పాత సబ్జెక్టు ఎంచుకున్నాడు. కనీసం ప్రజెంటేషన్ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. సినిమా చూసినంత సేపు గతంలో అవినీతి వ్యతిరేక సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఫస్టాఫ్ కాస్త ఫర్వాలేదనిపించి సెకండాఫ్‌లో ప్రేక్షకులు సహనానికి పరీక్ష పెట్టాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి రేకెత్తించే విధంగా స్క్రీప్లే లేదు. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలను మాత్రం మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి. జి.వి.ప్రకాష్ అందించిన సంగీతం ఫర్వా లేదు. కెమెరామెన్ పని తనం బావుంది. సినిమా ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సి ఉంది. ‘జెండాపై కపిరాజు' సినిమాలో కంటెంటు ఉంది కానీ....దాన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో నిరాశ పరిచే విధంగా ఉంది.

జెండాపై కపిరాజు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

జెండాపై కపిరాజు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+