కనులు కనులను దోచాయంటే స్టోరి

  కనులు కనులను దోచాయంటే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, రక్షన్, గౌతమ్ మీనన్, నిరంజని అహతైన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డెసింగు పెరియసామి వహించారు. నిర్మాత అంటో జోసెఫ్ నిర్మించారు. డి ఇమ్మాన్ స్వరాలు సమకుర్చరు.

  కథ 

  సిద్దు (దుల్కర్ సల్మాన్) యాప్ డెవలపర్ అని చెప్పుకుంటూ తన స్నేహితుడితో వైట్ కాలర్ నేరాలు చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఆ క్రమంలో తొలి చూపులోనే మీరా అలియాస్ మధుమిత (రితూవర్మను చూసి సిద్దు ప్రేమలో పడిపోతాడు. కానీ ఓ దశలో మధుమిత ఇచ్చిన షాక్‌కు సిద్ధూ ద్వయానికి దిమ్మ తిరిగిపోతుంది. వైట్ కాలర్ నేరాలను పరిశోధించే ఆఫీసర్ ప్రతాప్ ( గౌతమ్ వాసుదేవ మీనన్) చేతికి సిద్ధూ ద్వయం దొరికిపోతారు. సిద్దూకు మధుమిత ఎలాంటి షాకిచ్చింది? ఆ షాక్ నుంచి తేరుకొని మధుమితకు ఎలాంటి గుణపాఠం చెప్పాలనుకొన్నాడు? పోలీస్ ఆఫీసర్ తన కేసును ఎలా పరిశోధించాడు? సిద్ధు, అతడి స్నేహితుడు ఎందుకు దొంగతనాలకు పాల్పడాలనుకొంటారు. ఈ కథలో మధుమిత, ఆమె స్నేహితురాలు (నిరంజనీ) పాత్రలు ఏంటి? సిద్ధును మధుమిత ఎందుకు మోసగించింది. ఈ స్టోరీలో సాఫ్ట్ విలన్ ( అనీష్ కురువిల్లా) ఎలాంటి ట్విస్టులు ఇచ్చాడనే ప్రశ్నలకు సమాధానమే కనులు కనులను దోచాయంటే సినిమా కథ.


  **Note:Hey! Would you like to share the story of the movie కనులు కనులను దోచాయంటే with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X