కేరింత సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, తేజశ్వని, పార్వతీశం, విశ్వనాథ్, సుకీర్తి, శ్రీదివ్య తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయికిరణ్ అడివి నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మింరు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కి జె మేయర్ స్వరాలు అందించారు.
కథ
మూడు జంటల ప్రేమకథ ఇది. కాలేజీ ఫ్రెండ్స్ జై(సుమంత్ అశ్విన్), నూకరాజు (పార్వతీశం), సిద్దార్థ్ (విశ్వనాథ్), ప్రియా(తేజస్వి), భావన(సుకీర్తి) మంచి స్నేహితులు. జై , మనస్విని(శ్రీ దివ్య) ని బస్సులోచూని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కోసం చాలా వెతుకుతాడు. ఆమె దొరికిన తర్వాత ప్రేమ విషయం తెలియజేయడానికి ఇబ్బంది పడతాడు. తండ్రి కూలి చేసి చదువుకోసం డబ్బు పంపిస్తే చదువుకోకుండా ఫేస్ బుక్ లో ప్రేమ కోసం ప్రాకులాడుతుంటాడు నూకరాజు. భావన తనను ప్రేమిస్తున్నా ఆ విషయం గ్రహించలేడు. తీరా గ్రహించాక ఆమె అతన్ని దూరం పెడుతుంది. సిద్ధార్థ్ కి మ్యూజిక్ అంటే ప్రాణం. ప్రియా ప్రేమిస్తాడు. అయితే ఈ విషయాలు ఇంట్లో చెప్పడానికి భయపడతాడు. ఈ ముగ్గురి కాలేజీ జీవితం, ప్రేమ కథల, తర్వాత ఎదుర్కొన్న పరిస్థితుల సమాహారమే కేరింత సినిమా.