కృష్ణ అండ్ హిస్ లీల (2020)
Release date
25 Jun 2020
genre
కృష్ణ అండ్ హిస్ లీల స్టోరి
కృష్ణ అండ్ హిస్ లీల సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వద్నికట్టి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవికాంత్ పేరెపు వహించారు. సురేష్ బాబు, సంజయ్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు.
కథ
అప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేరేందుకు సిద్దమయ్యే యువకుడు కృష్ణ (సిద్దు జొన్నలగడ్డ)కు సత్య (శ్రద్దా శ్రీనాథ్)తో బ్రేకప్ జరుగుతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సత్యను వదులుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో తన కాలేజీలో చదివే రాధ (షాలిని వద్నికట్టి) అనే యువతితో ప్రేమలోపడుతాడు. వారి ప్రేమ చిగురు తొడుగుతున్న సమయంలోనే కృష్ణకు జాబ్ రావడంతో బెంగుళూరుకు వెళ్లిపోతాడు. అలా రాధకు దూరమైన కృష్ణకు సత్య మళ్లీ దగ్గరవుతుంది. బెంగళూరులో తన సోదరి ఫ్రెండ్ రుక్సార్ (సీరత్ కపూర్)పై ఒకరకమైన ఆకర్షణ పెరుగుతుంది. కృష్ణకు సత్య మళ్లీ చేరువ కావడంతో రాధ పరిస్థితి ఏమిటి? సత్యతో అఫైర్‌ను కొనసాగించాడా? లేక రాధతోనే ఉండి సత్యను వదులుకొన్నాడా? రాధ, సత్యతో ఉన్న రిలేషన్‌కు కృష్ణ ఎలా జస్టిఫై చేశాడు. రుక్సార్‌తో వ్యవహారం ఎలా ముగిసింది. ఫ్యామిలీలో తన తల్లి, తండ్రి బ్రేకప్ కృష్ణపై ఎలాంటి ప్రభావం చూపించింది. తండ్రి లేని జీవితాన్ని కృష్ణ ఎలా ఫీలయ్యాడు? చివరకు తనలో ఉన్న అసంతృప్తికి తండ్రి తనకు ఎలాంటి పరిష్కారాన్ని చూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ కథ.
**Note:Hey! Would you like to share the story of the movie కృష్ణ అండ్ హిస్ లీల with us? Please send it to us ([email protected]).