X
తెలుగు » సినిమాలు » కృష్ణ అండ్‌ హిస్‌ లీల
కృష్ణ అండ్‌ హిస్‌ లీల

కృష్ణ అండ్‌ హిస్‌ లీల

Romance | 25 Jun 2020 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

కృష్ణ అండ్‌ హిస్‌ లీల స్టోరీ

కృష్ణ అండ్‌ హిస్‌ లీల సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్ధు జొన్నలగడ్డ,  శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, శాలిని వద్నికట్టి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవికాంత్ పేరెపు వహించారు. సురేష్ బాబు, సంజయ్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు.  కథ  అప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేరేందుకు సిద్దమయ్యే యువకుడు కృష్ణ (సిద్దు జొన్నలగడ్డ)కు సత్య (శ్రద్దా శ్రీనాథ్)‌తో బ్రేకప్ జరుగుతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సత్యను వదులుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో తన కాలేజీలో చదివే రాధ (షాలిని వద్నికట్టి) అనే యువతితో ప్రేమలోపడుతాడు. వారి ప్రేమ చిగురు తొడుగుతున్న సమయంలోనే కృష్ణకు జాబ్ రావడంతో బెంగుళూరుకు వెళ్లిపోతాడు. అలా రాధకు దూరమైన కృష్ణకు సత్య మళ్లీ దగ్గరవుతుంది. బెంగళూరులో తన సోదరి ఫ్రెండ్ రుక్సార్ (సీరత్ కపూర్)‌పై ఒకరకమైన ఆకర్షణ పెరుగుతుంది. కృష్ణకు సత్య మళ్లీ చేరువ కావడంతో రాధ పరిస్థితి ఏమిటి? సత్యతో అఫైర్‌ను కొనసాగించాడా? లేక రాధతోనే ఉండి సత్యను వదులుకొన్నాడా? రాధ, సత్యతో ఉన్న రిలేషన్‌కు కృష్ణ ఎలా జస్టిఫై చేశాడు. రుక్సార్‌తో వ్యవహారం ఎలా ముగిసింది. ఫ్యామిలీలో తన తల్లి, తండ్రి బ్రేకప్ కృష్ణపై ఎలాంటి ప్రభావం చూపించింది. తండ్రి లేని జీవితాన్ని కృష్ణ ఎలా ఫీలయ్యాడు? చివరకు తనలో ఉన్న అసంతృప్తికి తండ్రి తనకు ఎలాంటి పరిష్కారాన్ని చూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ కథ.
Read More

కృష్ణ అండ్‌ హిస్‌ లీల కాస్ట్ & క్రూ

కృష్ణ అండ్‌ హిస్‌ లీల సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవికాంత్ పెరుపు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత సురేష్ బాబు, సంజయ్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కృష్ణ అండ్‌ హిస్‌ లీల విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఎమోషనల్‌, యూత్, ఫన్ ఎలిమెంట్స్ కలబోసిన చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల. ప్రేక్షకుడికి చక్కని అనుభూతులు పంచుతంది. ముఖ్యంగా ఎక్కడో తన జీవితంలో జరిగే సంఘటనలు కనెక్ట్ చేయడానికి అవకాశం లేకపోలేదు. అన్ని అంశాలతో కథను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దర్శకుడి విజన్‌ను హీరోగా సిద్దు మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. అయితే ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాం మీద కంటే నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే అన్ని రకాలుగా మంచి ఫీడ్‌బ్యాక్ లభించి ఉండేదనడంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఇది ఓటీటీ సినిమా కాదు.. థియేట్రికల్ ఎక్సీపిరియెన్స్ ఫీలయ్యే సినిమా అని చెప్పవచ్చు.

కృష్ణ అండ్‌ హిస్‌ లీల సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కృష్ణ అండ్‌ హిస్‌ లీల

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+